News November 5, 2025
కోటిలింగాలలో గోదావరికి మహా హారతి

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాలలోని ప్రాచీన కోటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం గోదావరి మహా హారతి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గోదావరి తీరం దీపాలతో కళకళలాడగా, అర్చకులు వైదిక మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు చేపట్టారు. స్థానిక భక్తులు, మహిళా సంఘాలు, సేవా సంస్థల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి సంకీర్తనలతో గోదావరికి దీపాలు సమర్పించారు. శివయ్య నామస్మరణలు చేశారు.
Similar News
News November 5, 2025
కొడంగల్: రవాణా పేరుతో అధికంగా వసూలు..!

గ్యాస్ సిలిండర్ రవాణా పేరుతో అధికంగా వసూలు చేస్తున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని గ్యాస్ ఏజెన్సీల నుంచి సిలిండర్లు సరఫరా చేస్తున్న సిబ్బంది రవాణా ఛార్జీల పేరుతో అధికంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. గ్యాస్ ధర రూ.905 ఉంటే రూ.1,000 వరకు వసూలు చేస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు.
News November 5, 2025
పిల్లల ముందు ఆ పనులు వద్దు!

పేరెంట్స్ ఏది చేస్తే చిన్న పిల్లలు వాటినే అనుకరిస్తారు. కొంతమంది భార్యాభర్తలు కిడ్స్ ముందే రొమాన్స్ చేస్తుంటారు. అది వారి మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే పిల్లల ముందు ఇతరులను తక్కువ చేసి మాట్లాడటం, అనుచితంగా ప్రవర్తించడం వల్ల వాళ్లూ అలాగే తయారయ్యే ప్రమాదం ఉంటుంది. ఇక చిన్నారుల ముందు మందు తాగడం, సిగరెట్లు కాల్చడం వల్ల వారూ చెడు అలవాట్లకు గురయ్యే ఆస్కారం ఉంది. Share It
News November 5, 2025
పరిగి: ‘అన్నం పెట్టే రైతన్నలకు అండగా ఉంటాం’

వ్యవసాయానికి కరెంటు సరఫరా సరిగా లేక రాత్రి, పగలు అన్నదాతలు అవస్థలు పడుతున్నారని, లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించాలని రైతులు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. స్పందించిన ప్రభుత్వం రైతులకు నూతన ట్రాన్స్‌ఫార్మర్లను బుధవారం పంపిణీ చేశారు. ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్నలకు అండగా ఉంటామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


