News October 16, 2025

కోట్ల నాకు బాగా తెలుసు: మోదీ

image

కర్నూలు పర్యటనలో భాగంగా ఓర్వకల్లు విమానాశ్రయానికి మోదీ వచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబు వరుసగా పరిచయం చేశారు. డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి గురించి ప్రధానికి చెబుతుండగా.. ‘ఈ పెద్ద మనిషి నాకు బాగా తెలుసు. కేంద్ర మంత్రిగా పనిచేశారు కదా?’ అని చంద్రబాబుతో ప్రధాని అన్నారు.

Similar News

News October 17, 2025

KMR: 49 షాపులకు 419 దరఖాస్తులు

image

మద్యం దుకాణాల దరఖాస్తుల ప్రక్రియకు కామారెడ్డి జిల్లాలో భారీ స్పందన లభిస్తోంది. గురువారం వరకు జిల్లాలోని మొత్తం 49 వైన్ షాపులకు 419 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంత రావు పేర్కొన్నారు.
కామారెడ్డి: 15 షాపులకు 104 దరఖాస్తులు
బాన్సువాడ: 9 షాపులకు 84 దరఖాస్తులు
బిచ్కుంద: 10 షాపులకు 79 దరఖాస్తులు
దోమకొండ: 8 షాపులకు 77 దరఖాస్తులు
ఎల్లారెడ్డి: 7 షాపులకు 75 దరఖాస్తులు వచ్చాయన్నారు.

News October 17, 2025

NZB: ఫ్యాక్టరీలో గుట్కా తయారీ, ఇద్దరి అరెస్ట్

image

NZB శివారులో అక్రమంగా తయారు చేస్తున్న గుట్కాను CCS పోలీసులు పట్టుకున్నారు. జన్నెపల్లి రోడ్డులో ఓ ఫ్యాక్టరీలో సీసీఎస్ ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో గురువారం సోదాలు చేసి అక్కడ గుట్కా తయారు చేస్తున్నట్లు గుర్తించారు. గుట్కా తయారీకి సంబంధించిన సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. అసాన్, అమీర్ అనే నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఫ్యాక్టరీలో పాన్ మసాలా ముసుగులో గుట్కా తయారు చేస్తున్నారు.

News October 17, 2025

CM చంద్రబాబు, లోకేశ్ విదేశీ పర్యటనలు

image

AP: మంత్రి లోకేశ్ రేపట్నుంచి ఈనెల 25 వరకు AUSలో పర్యటించనున్నారు. వచ్చేనెల 14, 15న విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు ప్రారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు. పెట్టుబడులు, ఉపాధి కల్పనే ప్రధాన లక్ష్యంగా సీఎం చంద్రబాబు కూడా విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. నవంబర్ 2 నుంచి 5వ తేదీ వరకు లండన్‌లో పర్యటించనున్నారు. విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు.