News February 10, 2025
కోడలిపై మామ లైంగిక వేధింపులు..?

అత్తింటివారు వేధిస్తున్నారని మంథని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఓ యువతి నిరసన చేసింది. వివరాలు.. ఖమ్మం (D)కు చెందిన యువతికి పోచమ్మవాడకు చెందిన వ్యక్తితో పెళ్లైంది. ప్రస్తుతం ఆమె గర్భవతి కాగా మామ లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపణలు చేసింది. గత నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేసి పుట్టింటికి వెళ్లింది. భర్త మరో పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పడంతో ఆదివారం నిరసన చేపట్టింది. కేసు నమోదు చేసినట్లు SI రమేశ్ తెలిపారు.
Similar News
News July 7, 2025
బ్యాటింగ్, బౌలింగ్ అదరగొట్టారుగా..

రెండో టెస్టులో ఇంగ్లండ్‌పై గెలుపుతో గిల్ కెప్టెన్‌గా విజయాల ఖాతా తెరిచారు. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత జట్టుకు ఇదే తొలి విజయం. ఈ మైదానంలో ఆడిన గత 8 మ్యాచుల్లో ఏడు ఓడిపోగా ఒక మ్యాచును డ్రా చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్, రెండో ఇన్నింగ్సులో ఆకాశ్ దీప్ ఆరేసి వికెట్లతో అదరగొట్టారు. అటు కెప్టెన్ గిల్ 430 పరుగులతో మరిచిపోలేని ప్రదర్శన చేశారు. జడేజా, పంత్, జైస్వాల్, రాహుల్ తమ వంతు పాత్ర పోషించారు.
News July 7, 2025
రేపు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

రేపు APలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. మరోవైపు TGలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, జనగాం, RR, HYD, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.
News July 7, 2025
సిద్దిపేట: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

కోహెడ మండలం తంగళ్లపల్లిలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. ఇద్దరు యువకులు బైక్‌పై వేగంగా వెళ్తూ గ్రామానికి చెందిన కొత్తూరు సత్తయ్య ఇంటి గోడను బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వారు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు బోదాసు శ్రీకాంత్, దామెర రిషిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.