News December 22, 2025
కోడిపుంజులకు కొట్లాటపై Pre Finals!

AP: గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంప్రదాయమైన కోడి పందేలకు పుంజులను సన్నద్ధం చేయడం తుది దశకు చేరింది. ఎగ్స్, కాజు, బాదం తదితర విటమిన్ ఫుడ్‌తో నెలలుగా ప్రత్యేకంగా పెంచి పోషించిన కోళ్లకు నిర్వాహకులు ప్రస్తుతం పందేల ట్రైనింగ్ ముమ్మరం చేశారు. ప్రత్యర్థి కోడిపై బలంగా దాడి చేసేలా, బరిలో ఎక్కువసేపు నిలబడేలా స్పెషల్ కేర్ టేకర్స్, ట్రైనర్స్ శిక్షణ ఇస్తున్నారు.
Similar News
News December 29, 2025
ESIC హాస్పిటల్ కలబురగిలో ఉద్యోగాలు

<
News December 29, 2025
శీతాకాలంలో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే?

శీతాకాలంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల పిల్లలు త్వరగా రోగాలబారిన పడతారు. ఇలా కాకుండా ఉండాలంటే కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. పిల్లలు పరిశుభ్రత పాటించడం, నీరు ఎక్కువగా తాగడం ముఖ్యం. అలాగే పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఇవ్వాలి. వీటితో పాటు పప్పుధాన్యాలు, పాలు, పెరుగు, గుడ్లు, నట్స్ వంటి పోషకాహారాన్ని వారి ఆహారంలో చేర్చాలి. జంక్ ఫుడ్‌ను నివారించాలని సూచిస్తున్నారు.
News December 29, 2025
‘పెద్ది’లో జగపతిబాబు షాకింగ్ లుక్

రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి నటుడు జగపతిబాబు ఫస్ట్ లుక్ విడుదలైంది. చూసిన వెంటనే గుర్తుపట్టలేనంతగా ఉన్న ఆయన లుక్ అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది. ‘అప్పలసూరి’ అనే పాత్రలో జగపతిబాబు కనిపించనున్నట్లు మూవీటీమ్ ప్రకటించింది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది.


