News January 3, 2025
కోడి పందేలు నిర్వహిస్తే ఉపేక్షించం: సీపీ
కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు. సంక్రాంతి పండుగ రానున్న నేపథ్యంలో కోడి పందేలను నిషేధించే దిశగా పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఈరోజు పోలీస్ అధికారులతో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదని సీపీ అధికారులకు స్పష్టం చేశారు.
Similar News
News January 6, 2025
నేటి నుంచి ఖమ్మం మార్కెట్ పునః ప్రారంభం
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం నుంచి క్రయవిక్రయాలు పునః ప్రారంభం కానున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు ఆదివారం తెలిపారు. రెండు రోజుల సెలవులు అనంతరం సోమవారం మార్కెట్ తిరిగి ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ విషయాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు గమనించి తమ పంటలను మార్కెట్‌కు తీసుకొచ్చి అమ్ముకోవాలని సూచించారు.
News January 5, 2025
ఖమ్మంలో ఐఎన్టీయూసీ ఆత్మీయ సమ్మేళనం
ఖమ్మం నగరంలో ఆదివారం ఐఎన్టీయూసీ ఆత్మీయ సమ్మేళనం జిల్లా అధ్యక్షుడు కొత్త సీతారాముల అధ్యక్షతన జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనానికి 26 సంఘాల సంఘటిత, అసంఘటితరంగా జిల్లా బాధ్యులు ఐఎన్టీయూసీ మండల ప్రెసిడెంట్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర యువనాయకులు తుమ్మల యుగంధర్, ఐఎన్టీయూసీ ఉమ్మడి జిల్లా జనరల్ సెక్రటరీ నాగన్న గౌడ్ జలీల్ పాల్గొన్నారు.
News January 5, 2025
సివిల్స్ విద్యార్థులు రూ. లక్ష చెక్కులు.. పాల్గొన్న మంత్రులు
సింగరేణి కార్మికులకు రూ.1.25 కోట్ల ప్రమాద భీమా పాలసీ అమలు స్కీంను సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సివిల్స్‌కు ఎంపికైన విద్యార్థులకు సింగరేణి సహకారంతో లక్ష రూపాయల చెక్కులను సీఎం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సింగరేణి ఎండీ బలరాం నాయక్ పాల్గొన్నారు.