News January 7, 2026
కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సందర్భంగా ఎక్కడైనా కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ లక్ష్మీశ హెచ్చరించారు. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు చట్టాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, సంయుక్త బృందాలతో తనిఖీలు చేపట్టి కోడి పందేలు జరగకుండా చూడాలని ఆయన ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో గోడ పత్రికలు విడుదల చేశారు.
Similar News
News February 15, 2026
తిరుపతి: రైలు నుంచి కింద పడి వ్యక్తి దుర్మరణం

నందలూరు–హస్తవరం రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం గుర్తించినట్లు రేణిగుంట GRP పోలీసులు తెలిపారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా, రైలు నుంచి జారిపడటంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. మృతుడు మెరూన్ స్వెటర్, బూడిద చొక్కా, లుంగీ ధరించి ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
News February 15, 2026
ఈ నెల 17న ఆకాశంలో అద్భుతం

ఆకాశంలో ఈ నెల 17వ తేదీ రింగ్ ఆఫ్ ఫైర్‌గా పిలిచే వలయాకార సూర్యగ్రహణం ఏర్పడనుంది. 3.26pm-7.57pm వరకు గ్రహణం ఉంటుంది. అయితే భారతదేశం నుంచి దీన్ని వీక్షించే అవకాశం లేదు. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అంటార్కిటికా ఖండం నుంచి స్పష్టంగా కన్పిస్తుంది. సాధారణంగా సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణ టైమ్‌లో చంద్రుడు సైజు చిన్నగా కనిపించడంతో సూర్యుడి అంచులు రింగ్‌లా దర్శనమిస్తాయి.
News February 15, 2026
గుంటూరు జిల్లా ప్రజలకు కీలక సూచన

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో రేపు (సోమవారం) జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) కార్యక్రమాన్ని రద్దు చేశారు. మహాశివరాత్రి బందోబస్తు విధుల్లో సిబ్బంది నిమగ్నమై ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదుదారులందరూ ఈ విషయాన్ని గమనించాలని, ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


