News February 9, 2026
కోడి మాంసం, గుడ్లు తినొచ్చు: మంత్రి అచ్చెన్నాయుడు

AP: బర్డ్ ఫ్లూను పూర్తిగా నియంత్రణలోకి తీసుకొస్తున్నామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అన్నమయ్య(D) సదుం(M)లో వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. కోళ్ల పెంపకందారులు బయోసెక్యూరిటీ చర్యలు పాటించాలని ఆదేశించారు. కోడి మాంసం, గుడ్ల వినియోగం పూర్తిగా సురక్షితమని చెప్పారు. అసాధారణ రీతిలో పక్షులు మరణిస్తే అధికారులకు తెలియజేయాలన్నారు.
Similar News
News February 20, 2026
ట్రంప్ మాకు వద్దు బాబోయ్: భారతీయ అమెరికన్లు

ట్రంప్ పాలనపై భారతీయ అమెరికన్లు అసంతృప్తితో ఉన్నట్లు ఇండియన్ అమెరికన్ యాటిట్యూడ్స్ సర్వే (IAAS) వెల్లడించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 71% మంది వ్యతిరేకంగా, 29% మంది సానుకూలంగా ఉన్నట్లు తెలిపింది. ఇమిగ్రేషన్, దేశ ఆర్థిక వ్యవస్థ, ట్రేడ్, టారిఫ్స్ విషయంలో ట్రంప్ పాలసీలను 65% మందికిపైగా వ్యతిరేకించారు. భారతీయులపై విద్వేషం, భారత్‌తో బంధం సడలడం వంటి కారణాలతో అభిప్రాయం మారినట్లు తెలుస్తోంది.
News February 20, 2026
ఒమన్‌ను చిత్తుచేసిన ఆస్ట్రేలియా

T20WC గ్రూప్ దశ చివరి మ్యాచ్‌లో ఒమన్‌పై ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 105 పరుగుల లక్ష్యాన్ని 9.4 ఓవర్లలోనే ఛేదించింది. మిచెల్ మార్ష్ 33 బంతుల్లో 64*(7 ఫోర్లు, 4 సిక్సులు), హెడ్ 19 బంతుల్లో 32(6 ఫోర్లు) విధ్వంసం సృష్టించారు. ఈ గెలుపుతో గ్రూప్-Bలో మూడో స్థానంలో నిలిచింది. ఇప్పటికే ఆ జట్టు సూపర్-8 రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.
News February 20, 2026
మ్యాక్సీ అరుదైన రికార్డు

AUS ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ అరుదైన రికార్డు సాధించారు. T20Iలలో 2,000 రన్స్, 50 వికెట్లు తీసి, 50 క్యాచ్‌లు పట్టిన ఐదో క్రికెటర్‌గా నిలిచారు. T20WCలో ఇవాళ ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్లు తీయడం ద్వారా ఈ ఘనత సాధించారు. గతంలో నబీ(AFG), సికందర్(ZIM), హార్దిక్(IND), వీరందీప్ సింగ్(మలేషియా) ఈ ఫీట్ నమోదు చేశారు. కాగా ఇవాళ్టి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ 16.2 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌటైంది.


