News May 9, 2024

కోడూరు: ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి

image

ఓబులవారిపల్లి మండలం చిన్న ఓరంపాడు భద్రావతి నగర్‌కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి మడి తొట్టి సుబ్బ నరసయ్య (27) ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం సాయంత్రం జడ్పీ హై స్కూల్ మిద్దె పైన పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకోవడంతో మంటలు అంటుకొని తట్టుకోలేక కిందకు దూకడంతో మృతి చెందారు. పోలీసులు శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News September 10, 2025

వారం రోజుల్లో 50 వేల టన్నుల యూరియా రానుంది: కలెక్టర్ శ్రీధర్

image

వారం రోజుల్లో 50 వేల టన్నుల యూరియా అందుబాటులోకి రానుందని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. మంగళవారం యూరియా డిమాండ్, నిల్వలు, సరఫరాపై జేసీ అదితి సింగ్, ఎస్పీ అశోక్ కుమార్‌లతో కలిసి కలెక్టర్ సమీక్షించారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఇప్పటికే 12,800 మెట్రిక్ టన్నుల యూరియాను ఆయా ప్రాంతాల రైతు సేవా కేంద్రాలు, సంబంధిత డీలర్ల ద్వారా అందించామన్నారు. సరిపడా యూరియాను అందించేందుకు సిద్ధం చేశామన్నారు.

News September 9, 2025

ప్రొద్దుటూరు: బార్‌లుగా మారిన బ్రాంది షాపులు

image

మద్యం దుకాణల్లో బల్లలు వేసి, మద్యం తాగించడానికి పర్మిట్ రూములకు అనుమతులు పొందారు. ప్రొద్దుటూరు ప్రోహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 21 మద్యం దుకాణాలు ఉన్నాయి. మున్సిపాలిటీలో 18, రూరల్ ప్రాంతంలో 3 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇక్కడి మద్యం దుకాణాల యజమానులు పర్మిట్ రూముల ఏర్పాటుకు ప్రభుత్వానికి మున్సిపాలిటీలో ఏడాదికి రూ.7.50 లక్షలు, రూరల్‌లో రూ.5 లక్షలు చొప్పున 3 నెలలకు డబ్బులు చెల్లించారు.

News September 9, 2025

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు: కలెక్టర్

image

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను రైతులు విధిగా వేయించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ సూచించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లాలో 3,71,400 డోసుల టీకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 4 నెలలు వయస్సు దాటిన పశువులకు టీకాలు వేయించాలన్నారు.