News April 4, 2024
కోడూరు: కృష్ణా నదిలో దూకి యువకుడి ఆత్మహత్య..!

కృష్ణా నదిలో దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కోడూరు మండల పరిధిలోని ఉల్లిపాలెం భవానీపురం వారధి చోటు చేసుకుంది. అవనిగడ్డ సీఐ త్రినాథ్ తెలిపిన వివరాల మేరకు గుడివాడకు చెందిన చిన్న శంకర్రావు(33) అనే యువకుడు బుధవారం రాత్రి ఉల్లిపాలెం వారిధి వద్ద తన యొక్క వాహనాన్ని వదిలి కృష్ణా నదిలో దూకినట్లు సమాచారం రావడంతో వెంటనే అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టగా గురువారం మృతదేహం లభ్యం అయిందని తెలిపారు.
Similar News
News October 28, 2025
కృష్ణా: నేడు సినిమా థియేటర్లు మూసివేత

మొంథా తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో మంగళవారం ఒక్క రోజు జిల్లాలోని అన్ని సినిమా హాల్స్‌ను మూసి వేయాలని కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఎటువంటి సినిమా ప్రదర్శనలు వేయకుండా చర్యలు తీసుకోవాలని తహశీల్దార్లను ఆదేశించారు. తుపాన్ ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ సమయంలో ప్రజలంతా తమ తమ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలన్నారు.
News October 27, 2025
కృష్ణా: రిలీఫ్ క్యాంప్‌ల్లో 1,482 మంది

మొంథా తుపాన్ తీవ్రత పెరుగుతుండటంతో జిల్లాలోని లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వస్తున్నారు. జిల్లాలో మొత్తం 189 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రానికి 1,482 మంది ఈ కేంద్రాలకు చేరుకున్నారు. మచిలీపట్నం డివిజన్ లోని 92 కేంద్రాల్లో 1,230 మంది, గుడివాడ డివిజన్ లోని 36 కేంద్రాల్లో 82 మంది, ఉయ్యూరు డివిజన్ లోని 61 కేంద్రాల్లో 170 మంది పునరావాసం పొందుతున్నారు.
News October 27, 2025
కృష్ణా జిల్లాలో 188 రిలీఫ్ క్యాంప్‌లు

మొంథా తుపాన్ నేపథ్యంలో కృష్ణాజిల్లాలో 188 పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 670 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. మచిలీపట్నం డివిజన్ లో 93 కేంద్రాలు ఏర్పాటు చేయగా 534 మందిని, ఉయ్యూరు డివిజన్లో 61 కేంద్రాలకు గాను 141 మందిని తరలించారు. గుడివాడ డివిజన్లో 34 కేంద్రాలు ఏర్పాటు చేయగా ఒక్కరిని కూడా తరలించలేదు.


