News July 8, 2025

కోడూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

కోడూరు మండలం చిట్వేలి ప్రధాన రహదారి గంధంవడ్లపల్లి సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై లక్ష్మీప్రసాద్ రెడ్డి వివరాల మేరకు.. కోనేటి పెంచలయ్య (45) కోడూరులో కూరగాయల వ్యాపారం చేస్తుంటారు. సోమవారం రాత్రి మోటార్ బైక్‌పై చిట్వేలి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Similar News

News July 8, 2025

కంచరపాలెం: ఈనెల 11న జాబ్‌ మేళా

image

కంచరపాలెం ITI జంక్షన్ వద్ద జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 11న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి అరుణ మంగళవారం తెలిపారు. 8 కంపెనీలు పాల్గొంటున్న మేళాలో టెన్త్, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులుగా పేర్కొన్నారు. 18-45 ఏళ్లలోపు ఆసక్తి గల అభ్యర్థులు https://employement.ap.gov.in వెబ్‌ సైట్‌లో పేర్లు నమోదు చేసుకొని ధ్రువపత్రాలతో ఆరోజు ఉదయం 10 గంటలకు హాజరు కావాలన్నారు.

News July 8, 2025

‘ఇళ్ల స్థలాలకు అర్హుల వివరాలు ఆన్‌లైన్ చేయాలి’

image

ఇంటి నివేశన స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మంగళవారం విజయవాడ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి ఇళ్ల స్థలాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ గోపాలకృష్ణ పాల్గొన్నారు. ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ.. అర్హులైన వారి వివరాలు ఆన్లైన్ చేసి, ఆ తర్వాత స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

News July 8, 2025

NLG: జీపీ వర్కర్లకు మూడు నెలల జీతాలు విడుదల

image

గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఏప్రిల్, మే, జూన్ మాసాల వేతనాలుగా రూ.150 కోట్లు విడుదల చేసింది. ఒకటి రెండు రోజుల్లో జీతాలు వారి ఖాతాల్లోకి జమయ్యే అవకాశం ఉంది. నల్గొండ జిల్లాలోని 868 గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న 3,500 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులకు లబ్ధి చేకూరనుంది.