News February 6, 2025

కోడేరులో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య

image

కోడేరు మండల కేంద్రంలోనికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం రాత్రి జరిగింది. కుటుంబసభ్యుల కథనం మేరకు.. చిన్నరాజు రాత్రి తమతో కలిసి పడుకున్నాడు. తెల్లారేసరికి ఉరేసుకుని కనిపించటంతో వారు చుట్టపక్కల వారిని పిలిచారు. స్థానికులు మృతదేహాన్ని కిందికి దించారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. మృతుడికి భార్య కళమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 6, 2025

PPM: నిర్ణిత కాల వ్యవధిలోగా మ్యూటేషన్లు పరిష్కరించాలి

image

రీసర్వే, రెవెన్యూ సదస్సులు, మీ సేవా పోర్టల్ ద్వారా వచ్చే మ్యూటేషన్లను నిర్ణిత కాల వ్యవధిలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తహశీల్దార్లకు సూచించారు. 30 రోజులు దాటి ఒక్క రోజు ఆలస్యమైన సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెవెన్యూ సమస్యలపై సబ్ కలెక్టర్లు, తహశీల్దార్లు, రెవిన్యూ అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో గురువారం సమీక్షించారు.

News February 6, 2025

ఛాంపియన్స్ ట్రోఫీ: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్

image

ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్, పేసర్ హేజిల్‌వుడ్ దూరమైనట్లు ICC ప్రకటించింది. మడమ గాయంతో కమిన్స్, తుంటి సమస్యతో హేజిల్ ఆడటం లేదని పేర్కొంది. ఇప్పటికే గాయం కారణంగా మిచెల్ మార్ష్ వైదొలగగా, స్టొయినిస్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఈ నలుగురు కీలక ప్లేయర్ల స్థానంలో మరో నలుగుర్ని AUS క్రికెట్ బోర్డు ఎంపిక చేయాల్సి ఉంది. ఈనెల 19 నుంచి CT స్టార్ట్ కానుంది.

News February 6, 2025

ఏలూరు: అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

image

ఏలూరులో పలు నేరాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్ చేసి పోలీసులు వారి వద్ద నుంచి 469 గ్రాముల బంగారు ఆభరణాలు, 41 కేజీల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఏలూరు ఎస్పీ శివ ప్రతాప్ కిషోర్ తెలిపారు. నేరానికి పాల్పడిన వారిలో ముగ్గురు నిందితులు కాగా ఒకరు మైనర్ బాలుడు ఉన్నాడు. వీరంతా ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలు చెందిన నేరస్థులుగా గుర్తించారు. పలు కేసులలో నిందితులన్నారు.

error: Content is protected !!