News March 18, 2024
కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదుల స్వీకరణ: కలెక్టర్

కోడ్ ఉల్లంఘన ఫిర్యాదులను వివిధ మాధ్యమాల ద్వారా స్వీకరించడం జరుగుతోందని కలెక్టర్ జి.సృజన తెలిపారు. ఫిర్యాదులను సీ-విజిల్ యాప్‌లో కానీ, హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కానీ, కర్నూలు జిల్లా టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 7755కు కానీ, కాల్ సెంటర్ 08518-220125కు కానీ ఫిర్యాదు చేయవచ్చన్నారు. ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసే వారు డిఐపిఆర్ఓ_కర్నూలు ట్విట్టర్ అకౌంట్‌కు ఫిర్యాదును ట్యాగ్ చేయవచ్చన్నారు.
Similar News
News September 25, 2025
పెండింగ్ కేసులు తగ్గించండి: ఎస్పీ

పెండింగ్ కేసులు తగ్గించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. కేసుల ఛేదనకు టెక్నాలజీ ఉపయోగించాలన్నారు. రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. ప్రతీ కేసును 60 రోజుల్లో ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలన్నారు. వివిధ అంశాలపై చర్చించారు.
News September 25, 2025
అంతర్జాతీయ యోగా సమైక్య డైరెక్టర్‌గా అవినాష్ శెట్టి

అంతర్జాతీయ యోగా సమైక్య డైరెక్టర్‌గా కర్నూలు జిల్లాకు చెందిన యోగా సంఘం అధ్యక్షుడు అవినాష్ శెట్టిని నియమిస్తూ యోగా ఫెడరేషన్ ఆఫ్ ఏషియా అధ్యక్షుడు డాక్టర్ రాధాకృష్ణ, అంతర్జాతీయ యోగా స్పోర్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ధర్మచారి మైత్రీవనం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2025 నుంచి 2028 వరకు అవినాష్ శెట్టి పదవిలో కొనసాగుతారని పేర్కొన్నారు. అవినాష్ శెట్టికి క్రీడాకారులు అభినందనలు తెలిపారు.
News September 25, 2025
చీపురి పట్టిన కర్నూలు కలెక్టర్ డా.సిరి

కర్నూలులో గురువారం నిర్వహించిన ‘ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పాల్గొన్నారు. తుంగభద్ర నది సమీపంలోని సంకల్ భాగ్ వద్ద చీపురుపట్టి పరిసరాలను శుభ్రం చేశారు. పరిశుభ్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయని, ప్రతి ఒక్కరూ భాగస్వాములై పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. శుభ్రతతోనే ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు.