News December 14, 2025
కోడ్ ముగిసే వరకు ర్యాలీలు నిషేధం

ఎన్నికల కోడ్ ముగిసే వరకు విజయోత్సవ ర్యాలీలు నిషేధం అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బి.గితే తెలిపారు. రెండో విడత ఎన్నికలు పూర్తయిన సందర్భంగా కౌంటింగ్ అనంతరం విజేత ర్యాలీలు నిషేధం అన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉందని అన్నారు.
Similar News
News December 15, 2025
భద్రకాళి సన్నిధిలో మోగ్లీ చిత్ర యూనిట్

వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన భద్రకాళి అమ్మవారిని ఇటీవల విడుదలయిన మోగ్లీ చిత్ర యూనిట్ దర్శించుకుంది. చిత్రం హీరో రోషన్ కనకాల, హీరోయిన్ సాక్షి మడోల్కర్, చిత్ర యూనిట్ సభ్యులు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పూజానంతరం ఆలయ స్నపన మండపంలో మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి ప్రసాదములు అందజేశారు.
News December 15, 2025
లేటెస్ట్ సినిమా అప్‌డేట్స్

⋆ అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్‌సేన్, కయాదు లోహర్ జంటగా నటిస్తున్న ‘ఫంకీ’ సినిమా 2026, ఫిబ్రవరి 13న విడుదల
⋆ అడివి శేష్, మృణాల్ ఠాకూర్ నటిస్తున్న ‘డెకాయిట్’ సినిమా టీజర్‌ను ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన మూవీ టీమ్
⋆ విఘ్నేశ్ శివన్ డైరెక్షన్‌లో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ విడుదల వాయిదా.. ఈ నెల 18న రిలీజ్ కావాల్సి ఉండగా పోస్ట్‌పోన్ చేసిన టీమ్
News December 15, 2025
లీగల్ ఎయిడ్ క్లినిక్‌ల ద్వారా న్యాయ సలహాలు: జడ్జి సంతోష్

లీగల్ ఎయిడ్ క్లినిక్ ద్వారా న్యాయ సలహాలు అందించడంతో పాటు, ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తామని సిద్దిపేట జిల్లా లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ, జడ్జి సంతోష్ కుమార్ తెలిపారు. సోమవారం సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన క్లినిక్‌ను ప్రారంభించి ఆయన మాట్లాడారు. ప్రతి క్లినిక్‌లో ఒక అడ్వకేట్ తో పాటు పారా లీగల్ వాలంటీర్ అందుబాటులో ఉంటారని వివరించారు.


