News March 19, 2024

కోదాడలో రూ.4,76,900 నగదు పట్టివేత

image

ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా నగదు, ఇతర విలువైన వస్తువులు రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని కోదాడ రూరల్ ఎస్సై అనిల్ రెడ్డి అన్నారు. మంగళవారం కోదాడ రామాపురం ఎక్స్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీలో విజయవాడ నుంచి హైదరాబాదు వెళుతున్న కారులో రూ.4,76,900 నగదు పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకొని ఎస్ఎస్ టీం అధికారి వినయ్ కుమార్‌కు అప్పగించినట్లు తెలిపారు.

Similar News

News April 18, 2025

పోచంపల్లితో వినోబా భావేకు విడదీయని అనుబంధం

image

ఆచార్య వినోబా భావేకు <<16135013>>పోచంపల్లితో <<>>విడదీయని అనుబంధం ఉంది. మొదటిసారి 1951లో పోచంపల్లికి వచ్చారు. అలాగే 1956 జనవరి 30న గాంధీ వర్ధంతి సందర్భంగా రెండోసారి వచ్చారు. భూదానోద్యమానికి కార్యోన్ముఖునిగా నిలిచిన పోచంపల్లిని భూదాన గంగోత్రిగా అభివర్ణిస్తూ తన రెండో జన్మస్థలంగా వినోబా భావే పేర్కొనడం విశేషం. వినోబా భావే మరణాంతరం భారత ప్రభుత్వం ఆయన ఆవిశ్రాంత కృషికి గాను 1982లో ‘భారతరత్న’ బిరుదును ప్రకటించింది.

News April 17, 2025

NLG: వానాకాలం సాగు అంచనా 11.60 లక్షల ఎకరాలు!

image

వానాకాలం సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. దీనికి అవసరమైన ఎరువులు, విత్తనాల ప్రతిపాదనలు కూడా ఖరారు చేసిన వ్యవసాయ శాఖ.. కమిషనరేట్‌కు పంపించింది. గత వానాకాలంలో 11,50,556 ఎకరాల్లో వరి, పత్తి, ఇతర పంటల సాగు కాగా ప్రస్తుత వానాకాలంలో అదనంగా సుమారు 10 వేల ఎకరాలు పెరిగే అవకాశం ఉందని అంచనాలు వేసింది. ప్రస్తుత వానాకాలంలో 11,60,389 ఎకరాల్లో పంటలు సాగు కానున్నట్లు ప్రణాళిక ఖరారు చేసింది.

News April 17, 2025

NLG: వివాహితపై హత్యాయత్నం.. 20 ఏళ్లు జైలు

image

వివాహితపై యాసిడ్‌తో దాడి చేసిన వ్యక్తికి 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ NLG జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. నాంపల్లి(M) దామెర వాసి మహేశ్ గిరిజన మహిళను తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిచేస్తూ 2018లో ఆమెపై యాసిడ్ దాడికి యత్నించాడు. ఆమె నాంపల్లి PSలో ఫిర్యాదు చేయగా అప్పటి SI కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. జడ్జి రోజారమణి నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.2000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.

error: Content is protected !!