News October 12, 2024

కోదాడ: గిరిజన బిడ్డ.. సత్తా చాటింది..!

image

ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో కోదాడ మండలం బాలాజీ నగర్‌కు చెందిన గిరిజన విద్యార్థిని బానోతు శివ ప్రియాంక ఎస్జీటీ ఉద్యోగానికి ఎంపికయ్యారు. గిరిజన పేద కుటుంబానికి చెందిన శివ ప్రియాంక తల్లిదండ్రులు ప్రోత్సాహంతో విద్యను అభ్యసిస్తూ మొదటి సారి డీఎస్సీ పరీక్షలు రాశారు. కాగా, శివ ప్రియాంక ఎస్టీ విభాగంలో 4వ ర్యాంక్ సాధించారు. దీంతో పలువురు గ్రామస్థులు ఆమెను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News October 12, 2024

NLG: దసరా.. మీ VILLAGE స్పెషల్ ఏంటి?

image

దసరా పండుగ అనగానే పల్లె యాదికొస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారు తిరిగి సొంతూరుకు రావడం, బంధువులు, దోస్తులను కలిసి ఊరంతా తిరగడం బాగుంటుంది. ‘ఎప్పుడొచ్చినవ్.. అంతా మంచిదేనా’ అంటూ తెలిసినవారి పలకరింపు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతి ఊరిలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. పలు చోట్ల విభిన్నంగానూ చేస్తారు. మరి మీ ఊరిలో దసరా వేడుకలకు ఏం చేస్తారో కామెంట్ చేయండి.

News October 12, 2024

నల్గొండ: ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

image

రాష్ట్ర మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖశాంతులతో, పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

News October 12, 2024

నల్గొండ: ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

image

విజయదశమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ అన్నింటా శుభం చేకూరాలని, విజయాలకు చిహ్నమే విజయదశమి పండుగ అని, ఈ విజయదశమి అందరిలో శాంతి, శ్రేయస్సు, సంతోషాన్ని పెంపొందించాలని, దుర్గామాత కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకున్నారు.