News March 18, 2025

కోదాడ: చోరీకి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు

image

చర్చిలో దొంగతనానికి వెళ్లి ఓ వ్యక్తి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. కోదాడ సీఐ శివశంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. అంబేడ్కర్ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఒక చర్చిలోకి అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడు. నిర్మాణం కోసం తీసుకొచ్చిన కొత్త కిటికీలు, డోర్‌ను దొంగిలించేందుకు ప్రయత్నించగా కాపలా వ్యక్తులు గమనించి కేకలు వేశారు. పారిపోయే క్రమంలో రాళ్లపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి.

Similar News

News February 28, 2026

దేశంలోనే రాష్ట్రం నంబర్-1.. రూ.422 కోట్లు మంజూరు

image

ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియలో తెలంగాణ దేశంలోనే నంబర్-1గా నిలిచింది. రాష్ట్రంలో 73.82 లక్షల మంది పట్టాదారులుండగా కేంద్రం 39.77 లక్షల మంది రైతుల నమోదును లక్ష్యంగా నిర్దేశించింది. అయితే రాష్ట్రం రికార్డు స్థాయిలో 43.59 లక్షల మందిని(110 శాతం) నమోదు చేసింది. ఇందుకు ప్రోత్సాహకంగా కేంద్రం రూ.422 కోట్లను విడుదల చేసింది.

News February 28, 2026

వరంగల్: ఇంటర్ పరీక్షలకు 212 మంది గైర్హాజరు

image

జిల్లాలో జరుగుతున్న ఇంటర్ పరీక్షల్లో విద్యార్ధుల గైర్హాజరు కలవర పెడుతోంది. ఒకే రోజులో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లిష్ పరీక్షకు 5,179 మందిలో 143 మంది, ఒకేషనల్ కోర్సుకు 823 మందిలో 69 మంది గైర్హాజరైనట్లు డీఈవో రంగయ్య నాయుడు తెలిపారు. మొత్తం 212 మంది హాజరు కాలేదన్నారు. పరీక్షల నిర్వహణలో పరీక్ష నిర్వాహకులుగా మాధవరావు, బండి విజయనిర్మల పూర్తి స్థాయిలో పర్యవేక్షించినట్లు వెల్లడించారు.

News February 28, 2026

అవకాడోతో కురులకు మేలు

image

అవకాడో కురుల పెరుగుదలకు కూడా మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే విటమిన్-ఈ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అవకాడోని హెయిర్ ప్యాక్‌తో జుట్టు చిట్లడం తగ్గడంతో పాటు తొందరగా పెరుగుతుంది. అవకాడో, అరటి పండు పేస్ట్‌ చేసి టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేయాలి. దీన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి, గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా 15రోజులకొకసారి చేస్తే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.