News February 3, 2025
కోదాడ: తాగిన మైకంలో ఉరేసుకొని యువకుడి సూసైడ్

ఉరేసుకొని వ్యక్తి మృతి చెందిన ఘటన కోదాడలోని లక్ష్మీపురం కాలనీలో జరిగింది. టౌన్ ఎస్ఐ సైదులు తెలిపిన వివరాలు.. కొండపల్లి జయంత్ (28) శిరీష ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆదివారం రాత్రి జయంత్ తాగిన మైకంలో ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి తల్లి గాయత్రి ఫిర్యాదు మేరకు కోదాడ టౌన్ ఎస్ఐ సైదులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 13, 2025
మెదక్: గవర్నర్లు మారారు తప్ప.. ప్రసంగాలు మారలేదు: హరీశ్‌రావు

అసెంబ్లీలో గతేడాది గవర్నర్ ప్రసంగానికి.. ఈ సారి గవర్నర్ ప్రసంగానికి తేడా ఏం లేదని.. గవర్నర్లు మారడం తప్ప.. ప్రసంగాలు మారలేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. చేయనివి చేసినట్లు, ఇవ్వని ఇచ్చినట్లుగా అబద్ధాలు, అవాస్తవాలతో కూడిన ప్రసంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్‌తో చెప్పించిందన్నారు. గవర్నర్ ప్రసంగంపై హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.
News March 13, 2025
మార్చి 13: చరిత్రలో ఈ రోజు

* 1899: హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు జననం
* 1901: అమెరికా మాజీ అధ్యక్షుడు బెంజమిన్ హారిసన్ మరణం
* 1940: జలియన్ వాలాబాగ్ కారకుడు మైఖెల్ డయ్యర్‌ను ఉద్దమ్ సింగ్ లండన్‌లో హతమార్చాడు
* 1955: నేపాల్ రాజుగా పనిచేసిన త్రిభువన్ మరణం
* 1978: డైరెక్టర్ అనూషా రిజ్వీ జననం
News March 13, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.