News October 15, 2025

కోదాడ: బనకచర్ల ప్రాజెక్టుకు మేం వ్యతిరేకం: మంత్రి ఉత్తమ్

image

కోదాడలో ఏర్పాటు చేసిన సంగతన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కడుతున్న బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకమని అన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపునకు వ్యతిరేకమని పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్‌కు ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.

Similar News

News October 15, 2025

TU: ప్రశాంతంగా ముగిసిన ఎంఈడీ రెండో సెమిస్టర్ పరీక్షలు

image

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని M.Ed రెండో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు విద్యార్థులు ఒక్కరు మినహా మిగతా విద్యార్థులు అన్ని పరీక్షలకు హాజరయ్యారన్నారు. విద్యార్థులు ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడలేదని వెల్లడించారు. బుధవారం జరిగిన పరీక్షలకు 29 మంది హాజరైనట్లు తెలిపారు.

News October 15, 2025

వారం రోజుల తర్వాత తెరుచుకోనున్న కురుపాం పాఠశాల

image

కురుపాం గురుకులానికి జాండీస్ కలకలం కారణంగా వారం రోజులు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు మరణించడంతోపాటు పదుల సంఖ్యలో చికిత్స పొందారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ప్రాభాకర్ రెడ్డి స్కూళుకు వారం రోజులు సెలవులు ఇవ్వాలని ఆదేశించారు. సెలువులు ముగియడంతో రేపటి నుంచి(గురువారం) పాఠశాల తెరుచుకోనుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

News October 15, 2025

జనగామ: మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం: డీసీఓ

image

జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నట్లు గురుకులాల డీసీవో శ్రీనివాసరావు తెలిపారు. బాలురకు 5, 9 తరగతుల్లో, బాలికలకు 5, 6, 7, 9 తరగతుల్లో మిగిలిన సీట్లను కేటాయించనున్నట్లు తెలిపారు. కావున ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 16, 17 తేదీల్లో జనగామలోని సోషల్ వెల్ఫేర్ గురుకులంలో సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులు అందజేయాలని కోరారు.