News October 7, 2025

కోదాడ: రూ.60 లక్షల గంజాయి స్వాధీనం

image

కోదాడ పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.60 లక్షల విలువైన క్వింటా 20 కేజీల గంజాయిని కోదాడ సీసీఎస్ పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారిని సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. గంజాయి రవాణా, సరఫరా, అమ్మకం, వినియోగం నేరమని, NDPS చట్టాల ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నరసింహ హెచ్చరించారు.

Similar News

News October 7, 2025

విశాఖ: ఆర్టీసీలో ఐటీఐ అప్రెంటీస్‌లకు అవకాశం

image

ఏపీఎస్ఆర్టీసీ విశాఖ రీజియన్ పరిధిలో 2వ విడత ఐటీఐ అప్రెంటిస్‌షిప్ అలాట్‌మెంట్లను రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు మంగళవారం జారీ చేశారు. అప్రెంటిస్‌లు భద్రతా నియమాలు పాటిస్తూ నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసినవారికి ఖాళీలను బట్టి ఔట్‌సోర్సింగ్‌లో అవకాశాలు కల్పిస్తామన్నారు. అలాగే 18 నెలల హెవీ లైసెన్స్ అనుభవం ఉన్నవారికి ఆన్-కాల్ డ్రైవర్లుగా అవకాశం ఉందని తెలిపారు.

News October 7, 2025

విశాఖలో రేషన్ డిపోలో బయటపడిన అవకతవకలు

image

విశాఖలోని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు కాంతారావు తనిఖీలు నిర్వహించారు. 294వ నంబర్ రేషన్ డిపోలో స్టాక్ లేని కారణంగా మేమె జారీ చేయాలని, 303వ నంబర్ డిపోలో పరిశుభ్రత పాటించాలన్నారు. 606, 604,590వ నంబర్ డిపోల్లో సమయపాలన పాటించకపోవడం, స్టాక్ ఇవ్వకపోవడం గమనించారు. అగనంపూడి జడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం పథకంలో గుడ్లు బరువు తక్కువగా ఉండడంతో హెచ్ఎంను హెచ్చరించారు.

News October 7, 2025

మాజీ ప్రధాని దేవెగౌడకు అస్వస్థత

image

మాజీ ప్రధాని HD దేవెగౌడ(92) అస్వస్థతకు గురయ్యారు. యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్(UTI)తో బాధపడుతున్న ఆయనను నిన్న బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అందించిన వైద్యులు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.