News March 7, 2025

కోనరావుపేటలో గుండెపోటుతో కార్మికుడి మృతి

image

కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన వడ్డెర కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడు. కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన దుండగుల కనకయ్య(50) అనే కార్మికుడు బావుసాయి పేట గ్రామ శివారులో బండలు కొట్టడానికి వెళ్ళాడు. ఆ క్రమంలో ఛాతిలో నొప్పి రావడంతో సిరిసిల్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య కనకవ్వ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

Similar News

News March 9, 2025

మహిళల ప్రగతితోనే సమాజ అభివృద్ధి: కలెక్టర్

image

మహిళలు ఉన్నత చదువులు చదివి, ఆర్థిక ప్రగతి సాధిస్తేనే సమాజం అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. మహిళలు తప్పనిసరిగా చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. చదువుతోనే సమాజంలో గౌరవం, గుర్తింపు వస్తాయన్నారు.

News March 8, 2025

బండి సంజయ్‌ని విరాట్ కోహ్లీతో పోలుస్తూ ఫ్లెక్సీలు

image

కరీంనగర్ బీజేపీలో ఎమ్మెల్సీ గెలుపు ఉత్సాహం కొనసాగుతోంది. నగరంలో వివిధ ప్రాంతాల్లో శనివారం బండి సంజయ్‌ను విరాట్ కోహ్లీ పోలుస్తూ ఫ్లెక్సీలను అభిమానులు ఏర్పాటు చేశారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపును క్రికెట్లో టీమ్ ఇండియా గెలుపుతో బండి సంజయ్ అభివర్ణించారు. బండి సంజయ్‌ని బీజేపీలో కోహ్లీగా అభివర్ణిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

News March 8, 2025

కరీంనగర్ జిల్లాలో కీలక స్థానాల్లో మహిళ మణులు

image

రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకంగా నిలిచే కరీంనగర్ జిల్లాలో మహిళ నేతలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. రామడుగుకు చెందిన నేరెళ్ల శారద రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ మహిళ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్నరెడ్డి, BJP జిల్లా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీలతో పాటు నార్కోటిక్స్ వింగ్ ACP మాధవి, CI శ్రీలత తదితరులు మహిళలోకానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

error: Content is protected !!