News September 23, 2024

కోనరావుపేట: నాటు బాంబుల తయారీ ముఠా అరెస్ట్

image

కోనరావుపేట మండలంలో నాటు బాంబులు తయారు చేస్తూ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన రాజలింగం పలువురికి నాటు బాంబులు, గన్ పౌడర్ విక్రయించారు. ఈ నాటు బాంబులతో జంతువులను వేటాడుతున్నట్లు గుర్తించిన పోలీసులు గ్రామాలపై నిఘా పెట్టారు. పోలీసులు 47 నాటు బాంబులు, గన్ పౌడర్‌ను స్వాధీనం చేసుకుని రాజలింగాన్ని అరెస్ట్ చేసినట్లు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

Similar News

News October 1, 2024

KNR: పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు..!

image

సంవత్సరానికి ఒక్కసారి పెద్దలకు నైవేద్యం పెట్టుకునే పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదే రోజు గాంధీ జయంతి కావడంతో అటు మాంసాహారం, మందు బంద్ ఉండడంతో పెత్తర అమావాస్య జరుపుకునేది ఎట్లా అని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు ఆలోచనలో పడ్డారు. పెత్తర అమావాస్యను కొందరు మంగళవారం లేదా గురువారం చేసుకోవడానికి ఆసక్తి చూపగా, పంతుళ్లు మాత్రం మంగళవారమే చేసుకోవాలని సూచిస్తున్నారు.

News October 1, 2024

జగిత్యాల జిల్లా DSC టాపర్‌గా జిందం అజయ్‌కుమార్

image

నిన్న విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో కోరుట్లకు చెందిన జిందం అజయ్‌కుమార్ జిల్లా మొదటి ర్యాంకు సాధించాడు. స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ విభాగంలో 80.3 మార్కులతో జగిత్యాల జిల్లా టాపర్‌గా నిలిచాడు. దీంతో ఆయన్ను బంధుమిత్రులు, స్నేహితులు అభినందిస్తున్నారు.

News October 1, 2024

దొంగతనాల నివారణకు ఒక స్పెషల్ టీం: జగిత్యాల ఎస్పీ

image

జగిత్యాల జిల్లాలోని దొంగతనాల నివారణకు ప్రతి సర్కిల్ పరిధిలో ఒక స్పెషల్ టీం నియమించి వాటిని నివారణకు కృషి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. అంతేకాకుండా ప్రాసిక్యూషన్‌లో భాగంగా కోర్టు వారు జారీ చేసిన నాన్‌బెయిలబుల్ వారెంట్లను నిందితుడిపై లేదా తప్పించుకుని తిరుగుతున్న నేరస్తులపై అమలుచేయడానికి అధికారులు అందరూ కృషి చేయాలని సూచించారు.