News March 14, 2025
కోనరావుపేట: మహిళ అదృశ్యం.. కేసు నమోదు చేసిన పోలీసులు

కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామానికి చెందిన దొంతరవేణి లక్ష్మి అనే మహిళ అదృశ్యమైంది. ఊరికి వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో భర్త రాజయ్య కోనరావుపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఎస్సై ప్రశాంత్ రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసినట్లు తెలిపారు. కాగా, ఆచూకీ తెలిసినవారు పోలీస్ స్టేషన్ ఫోన్ నంబర్ 8712656421 కు కాల్ చేయాలని ఎస్సై ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
Similar News
News November 15, 2025
సిర్పూర్ (టీ): యాజమాన్యం పిటిషన్‌కు యూనియన్ కౌంటర్

సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయిస్ యూనియన్ (ఈ-966) ఎన్నికలను అడ్డుకునేందుకు జేకే యాజమాన్యం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌కు కౌంటర్ దాఖలు చేయడానికి యూనియన్ వకాలతును అడ్వకేట్ ఎం. శంకర్‌కు అందజేసింది. ఎన్నికలను అడ్డుకోవడం దుర్మార్గమని వైస్ ప్రెసిడెంట్ గోగర్ల కన్నయ్య విమర్శించారు. యాజమాన్యం ప్రజాస్వామ్య ప్రక్రియలో జోక్యం చేసుకోకూడదని, వెంటనే పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
News November 15, 2025
తిరుపతి: 11వ సీటులోకి లగేజీ ఎలా వచ్చిందో..?

రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతికి బయల్దేరిన TTD మాజీ AVSO సతీష్ కుమార్ మధ్యలో చనిపోయిన విషయం తెలిసిందే. A1 భోగిలోని 29వ నంబర్ సీటును సతీశ్ కుమార్ బుక్ చేసుకోగా 11వ నంబర్ సీట్ వద్ద ఆయన లగేజీ లభ్యమైంది. శుక్రవారం ఉదయం 6.23 గంటలకు ఆ రైలు తిరుపతికి చేరుకున్నప్పుడు బెడ్ రోల్ అటెండర్ రాజీవ్ రతన్ లగేజీ గుర్తించి అధికారులకు అందజేశారు. వేరే సీట్లోకి లగేజీ ఎలా వచ్చిందనే దానిపై విచారణ కొనసాగుతోంది.
News November 15, 2025
వాహనదారులకు అవగాహన కల్పించండి: SP

రోడ్డు భద్రత నియమాలు పాటిస్తే ప్రమాదాలు తగ్గించవచ్చని నెల్లూరు ఎస్పీ డా.అజిత వేజెండ్ల సూచించారు. జిల్లాలోని పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ఆదేశించారు. బ్లాక్ స్పాట్లను గుర్తించి అక్కడ తగు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించాలని సూచించారు.


