News October 31, 2025
కోనరావుపేట: ‘రైస్ మిల్లుల్లో ధాన్యం అన్‌లోడ్ చేసుకోవాలి’

కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని రైస్ మిల్లుల్లో వెంటనే అన్‌లోడ్ చేసుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. కోనరావుపేట మండలం మల్కపేటలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వడ్ల కుప్పలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. నిర్వాహకులు రైతులకు అందుబాటులో ఉండి, అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News October 31, 2025
వీపనగండ్ల: మైనర్ బాలికకు నిశ్చితార్థం: నలుగురిపై కేసు

వీపనగండ్ల మండలంలో 15 ఏళ్ల మైనర్ బాలికకు నిశ్చితార్థం జరిపించినందుకు పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు గురువారం చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అమ్మాయి తల్లి, అబ్బాయి, అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాణి తెలిపారు. మైనర్‌ను వివాహమాడిన, ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.
News October 31, 2025
FLASH.. FLASH.. హనుమకొండ: పెళ్లి వాహనానికి యాక్సిడెంట్.. ముగ్గురు మృతి

హనుమకొండ(D)భీమదేవరపల్లి(M) ముల్కనూర్ PS పరిధి గోపాలపురం దగ్గర ఈరోజు తెల్లవారుజామున 2.20 గంటలకు యాక్సిడెంట్ జరిగింది. మహబూబాబాద్(D) కురవి(M) సైదాపురం గ్రామానికి చెందిన 21మంది నల్లపూసల తంతు ముగించుకుని పెళ్లి వాహనం (బొలేరో)లో సిద్దిపేట నుంచి తిరిగి వస్తున్నారు. ఈక్రమంలో గోపాలపురం దగ్గర వెనుక నుంచి లారీ ఢీకొట్టింది.ముగ్గురు మరణించగా పలువురికి గాయాలయ్యాయి. వారిని వరంగల్ MGMకు అంబులెన్స్‌లో తరలించారు.
News October 31, 2025
IND, AUS మ్యాచులో నమోదైన రికార్డులు

* ఉమెన్స్ ODIsలో హైయెస్ట్ రన్ ఛేజ్ ఇదే(339)
* WC నాకౌట్ మ్యాచులో ఇదే ఫస్ట్ 300+ రన్ ఛేజ్
* ఉమెన్స్ ODI WC ఫైనల్‌కు భారత్ రావడం ఇది మూడోసారి. 2005, 2017లో రన్నరప్‌గా నిలిచింది
* WCలో AUS వరుస విజయాలకు(15M తర్వాత) బ్రేక్
* WC నాకౌట్ మ్యాచుల్లో ఛేజింగ్‌లో సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా జెమీమా
* ఉమెన్స్ వన్డేల్లో 2 ఇన్నింగ్స్‌లు కలిపి ఇది సెకండ్ హైయెస్ట్ స్కోర్-679


