News March 28, 2025
కోనసీమలో జిల్లాలో ముగిసిన వైస్ ఎంపీపీ ఉప ఎన్నికలు

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గురువారం ఒక ఎంపీపీ, 3 వైస్ ఎంపీపీలకు ఎన్నికలు జరిగాయి. కాట్రేనికోన ఎంపీపీగా వైసీపీకి చెందిన కోలాటి సత్యవతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సఖినేటిపల్లి వైస్ ఎంపీపీలుగా వైసీపీకి చెందిన కొల్లాబత్తుల సుధాకర్, గుబ్బల ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పి.గన్నవరం వైస్ ఎంపీపీగా జనసేనకు చెందిన పప్పుల వెంకట సాయిబాబు ఎన్నికయ్యారు. ఉపఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి .
Similar News
News March 31, 2025
ఆసిఫాబాద్: కొత్త సంవత్సరం.. స్థానిక సమరం!

స్థానిక సంస్థల ఎన్నికల ఆశావహులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రాజకీయ భవిష్యత్‌ను తేల్చనుంది. ఆసిఫాబాద్ జిల్లాలో త్వరలో సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఈ నూతన సంవత్సరంలో జరగనున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన రాజకీయ ఆశావహులకు ఈ ఏడాది ‘కీ రోల్’ కాబోతోంది.
News March 31, 2025
రాజన్న సిరిసిల్ల: కొత్త సంవత్సరం.. స్థానిక సమరం!

స్థానిక సంస్థల ఎన్నికల ఆశావహులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రాజకీయ భవిష్యత్‌ను తేల్చనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో త్వరలో సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఈ నూతన సంవత్సరంలో జరగనున్నాయి. వీటితో పాటు ఈ ఏడాది సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన రాజకీయ ఆశావహులకు ఈ ఏడాది ‘కీ రోల్’ కాబోతోంది.
News March 31, 2025
MBNR: రంజాన్‌కు భారీ బందోబస్తు: SP

మహబూబ్ నగర్ జిల్లాలో రంజాన్ నేపథ్యంలో నేడు ఈద్గా, మసీద్‌లలో పెద్ద ఎత్తున ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేయనున్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండలాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని, భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ముందుగా ముస్లిం సోదరులకు రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు.