News January 6, 2026
కోనసీమలో ‘నిప్పుల’ జ్ఞాపకం.. పాశర్లపూడి నుంచి ఇరుసుమండ వరకు!

ఇరుసుమండ ONGC రిగ్ వద్ద సోమవారం <<1877026>>మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే<<>>. ఈ నేపథ్యంలో కోనసీమ జనం పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటున్నారు. 1995 జనవరి 8న పాశర్లపూడిలో జరిగిన ONGC బావి ‘బ్లోఅవుట్’ సుమారు 65 రోజుల పాటు నిప్పుల కొలిమిని తలపించింది. అదే తరహాలో 2014 జూన్ 2న నగరం గ్రామంలో గెయిల్ గ్యాస్ పైప్‌లైన్ పేలి 22 మందిని బలితీసుకుంది. ఆ భయానక మంటలు, ప్రాణనష్టం ఇప్పటికీ కోనసీమ జనం కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి.
Similar News
News January 7, 2026
జాతీయ స్థాయి ఖేల్ ఇండియా సెపక్ తక్రా పోటీలకు కోనసీమ క్రీడాకారులు

ఈ నెల 8 నుంచి 12 వరకు గుజరాత్‌లోని డామన్ డ్యూ ప్రాంతంలో 2వ ఆల్ ఇండియా ఖేలో బీచ్ సెపక్ తక్రా క్రీడా పోటీలు నిర్వహించానున్నారు. ఈ పోటీలకు కోనసీమ జిల్లాకు చెందిన క్రీడాకారులు కోసూరి ప్రసాద్, చొల్లంగి మోహన్ కృష్ణ ఎంపికైనట్లు జిల్లా సెపక్ తక్రా క్రీడా సంఘం అధ్యక్షుడు జవ్వాది తాతా బాబు, కార్యదర్శి సాయి దుర్గా ప్రసాద్ బుధవారం తెలిపారు. ఈ క్రీడాకారులు గతంలో జాతీయస్థాయిలో పోటీల్లో బహుమతులు సాధించారన్నారు.
News January 7, 2026
శ్రీశైలం కాలినడకన వెళ్లే భక్తులకు ఆంక్షలు

నల్లమలలోని నాగార్జునసాగర్-శ్రీశైలం పెద్ద పులుల అభయారణ్యం పరిధిలో జరుగుతున్న అఖిల భారత పులుల గణన-2026 నేపథ్యంలో శ్రీశైలానికి కాలినడకన వెళ్లే భక్తులకు అటవీశాఖ పలు ఆంక్షలు విధించింది. శ్రీశైలంలో మహాశివ రాత్రి బ్రహ్మోత్సవాలకు వెంకటాపురం నుంచి పాదయాత్రగా చేరే భక్తులను ఫిబ్రవరి 8 నుంచి 15 వరకు మాత్రమే అనుమతిస్తామని ఆత్మకూరు ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ అప్పావ్ పేర్కొన్నారు.
News January 7, 2026
సోమిరెడ్డి అవినీతి రూ.100కోట్లు: కాకాణి

సోమిరెడ్డి నీతిమాలిన మాటలు విని భవిష్యత్తులో ఉద్యోగులు ఇబ్బంది పడొద్దని మాజీ మంత్రి కాకాణి సూచించారు. ‘సోమిరెడ్డి చెప్పారనే వెంకటాచలం సర్పంచ్‌ను డీపీవో శ్రీధర్ రెడ్డి తొలగించారు. పోలీసులు లేకుండా MLA గ్రామాల్లోకి వెళ్తే ప్రజలు కుక్కను కొట్టినట్లు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఒక్క ఇరిగేషన్ శాఖలోనే సోమిరెడ్డి రూ.100కోట్ల అవినీతి చేశారు’ అని కాకాణి ఆరోపించారు.


