News October 28, 2025

కోనసీమలో విషాదం.. చెట్టు కూలి మహిళ మృతి

image

తుఫాను ప్రభావంతో కోనసీమలో ఈదురు గాలుల తీవ్రత పెరిగింది. ఈ నేపథ్యంలో మామిడికుదురు మండలంలో మంగళవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మాకనపాలెంలోని ఓ ఇంటి ఆవరణలో తాటిచెట్టు పడిపోవడంతో గూడపల్లి వీరవేణి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 29, 2025

రేపే సెమీస్.. ఆ ట్రెండ్ బ్రేక్ చేస్తారా?

image

ICC టోర్నీల్లో అన్‌లక్కీయెస్ట్ టీమ్‌గా పేరు తెచ్చుకున్న సౌతాఫ్రికా మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. రేపు WWC తొలి సెమీస్‌లో ENGతో తలపడనుంది. గెలిస్తే వన్డే WC చరిత్రలో తొలిసారి ఫైనల్‌ చేరనుంది. SA మెన్స్&ఉమెన్స్ టీమ్స్ ఎంత పటిష్ఠంగా ఉన్నా నాకౌట్ మ్యాచ్‌ల్లో చేతులెత్తేస్తాయి. ఈసారైనా ఆ ట్రెండ్‌ను బ్రేక్ చేస్తారేమో చూడాలి. ఈనెల 30న రెండో సెమీస్‌లో IND, AUS తలపడనున్నాయి.

News October 29, 2025

అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి రావద్దు: కర్నూలు కలెక్టర్

image

అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మట్టిమిద్దెలలో నివాసం ఉండకుండా సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ నెంబర్ 08514 -293903కు ఫోన్ చేయాలని సూచించారు. మొంథా తుఫాన్ నేపథ్యంలో మరో 3రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు.

News October 29, 2025

విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తారేమోనని ట్రాన్స్‌ఫార్మర్ ఎత్తుకెళ్లాడు

image

బకాయిల కోసం కరెంట్ కనెక్షన్‌ను కట్ చేస్తారేమోనని ఏకంగా ప్రభుత్వ ట్రాన్స్‌ఫార్మర్‌ను తీసుకుపోయాడో వ్యక్తి. మధ్యప్రదేశ్‌లోని భిండి జిల్లాలో ఇది జరిగింది. నిందితుడు శ్రీరామ్ బిహారీ త్రిపాఠి ₹1,49,795 బకాయి పడ్డాడు. సిబ్బంది ఇంటి కనెక్షన్‌తో పాటు అక్కడి 25KV ట్రాన్స్‌ఫార్మర్‌నూ తీసేస్తారని భావించాడు. దీంతో దాన్నితొలగించి ఇంటికి తీసుకుపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.