News June 9, 2024

కోనసీమ: అంబేడ్కర్ విగ్రహానికి అవమానం

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా కే.గంగవరం మండలం బాలాంత్రం లాకుల వద్ద గుర్తు తెలియని వ్యక్తులు డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి ఎరుపు అక్షరాలతో ఉత్తరం రాసి చేతికి తగిలించారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డీఎస్పీ బి.రామకృష్ణ ఆధ్వర్యంలో హుటాహుటిన క్లూస్ టీంతో చేరుకొని పరిశీలిస్తున్నారు. విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షిస్తామని డీఎస్పీ తెలిపారు.

Similar News

News November 26, 2024

కత్తిపూడిలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

image

శంఖవరం మండలం సీతంపేటలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి రాజమండ్రి వైపుగా వెళ్తున్న లారీని తప్పించే క్రమంలో మినీ వ్యాన్ అదుపు తప్పడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానిక సమాచారం మేరకు ఘటన స్థలానికి అన్నవరం SI శ్రీహరిబాబు చేరుకున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

News November 25, 2024

యువత భవితకు భరోసాగా నిలబడతాం: మంత్రి లోకేశ్

image

మంత్రి లోకేశ్‌ను కలిసే అవ‌కాశం ద‌క్కాల‌ని విజయవాడ ఇంద్ర‌కీలాద్రిని మోకాలిపై ఎక్కి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న రామచంద్రపురం మండలం చౌడవరం వాసి సాయికృష్ణని లోకేశ్ సోమవారం క‌లిశారు. ‘అతని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాను. వైసీపీ అరాచ‌క‌ పాలనపై ప్ర‌జాస్వామ్య‌ ప‌ద్ధ‌తిలో పోరాడిన త‌న‌ను ఇబ్బందులు పెట్టారు. యువ‌త భ‌విత‌కు భ‌రోసాగా నిల‌బ‌డ‌తాన‌ని అతనికి హామీ ఇచ్చా’ అని లోకేశ్ ‘X’లో పేర్కొన్నారు. 

News November 25, 2024

ఫీజు రీయంబర్స్మెంట్‌ను వారికే నేరుగా వేస్తాం: కలెక్టర్

image

ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయంబర్స్మెంట్‌ను విద్యా సంస్థలకే నేరుగా విడుదల చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు మేరకు త్వరలోనే ఈ ఏడాదికి సంబంధించిన మొత్తం మంజూరు చేస్తామని, దశల వారీగా బకాయిలు సైతం విడుదల చేయడం జరుగుతుందని, ఈ నేపథ్యంలో కలెక్టర్ స్పష్టమైన హామీనిస్తూ ఆ ప్రకటనలో తెలిపారు.