News July 30, 2024
కోనసీమ: అప్రెంటిస్‌కు దరఖాస్తుల ఆహ్వానం

కోనసీమ జిల్లా పరిధిలోని డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ ట్రేడ్లలో ఐటీఐ పాసైన అభ్యర్థులు APSRTCలో అప్రెంటిస్ కొరకు ఆగస్టు 1వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్లైన్లో www.apprenticeshipindia.gov.in వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలని జిల్లా ప్రజా రవాణాధికారి శ్రీనివాసరావు కోరారు. దరఖాస్తు చేసిన వారు ఆగస్టు 23వ తేదీ ఉదయం 10 గంటలకు విజయనగరం ఆఫీసులో హాజరు కావాలన్నారు.
Similar News
News November 8, 2025
రాజమండ్రి: నేడు యథావిధిగా పాఠశాలలు

జిల్లాలో రెపు పాఠశాలలు యథావిధిగా పనిచేస్తాయని డీఈఓ వాసుదేవరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తుఫాన్ కారణంగా జిల్లాలోని అన్ని మేనేజ్‌మెంట్ పాఠశాలలకు ప్రభుత్వం అక్టోబర్ నెల 27, 28, 29 తేదీల్లో సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సెలవుల స్థానంలో వీటిని భర్తీ చేస్తున్నామన్నారు. నవంబర్ 8, డిసెంబర్ 13, జనవరి 14 రెండవ శనివారాల్లో పాఠశాలలు విధిగా పనిచేయాలని విద్యాశాఖ ఆదేశించినట్లు డీఈవో చెప్పారు.
News November 8, 2025
ముంపు నివారణ చర్యలపై సమగ్ర ప్రణాళిక అవసరం: కలెక్టర్

తూ.గో జిల్లాలో ఇటీవల వరదలు, అధిక వర్షాల కారణంగా ప్రభావితమైన గ్రామాలలో ముంపు పరిస్థితులు పునరావృతం కాకుండా సమగ్ర నివారణ చర్యలు అమలు చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. శుక్రవారం రాజమండ్రి కలెక్టరేట్ వద్ద ఇరిగేషన్ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. మొంథా తుఫాను వల్ల పలు గ్రామాల్లో పంటలు ముంపుకు గురై రైతులు నష్టపోయారని కలెక్టర్ పేర్కొన్నారు.
News November 7, 2025
గోపాలపురం: కొడవలితో భార్యపై భర్త దాడి

భార్యపై అనుమానంతో భర్త కొడవలితో దాడి చేసిన ఘటన గోపాలపురం మండలం దొండపూడి మేదరపేటలో జరిగింది. ఎస్‌ఐ మనోహర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 6 అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో సింధూజపై అనుమానం పెంచుకున్న ఆమె భర్త కాసాని రామకృష్ణ మద్యం మత్తులో వచ్చి దాడి చేశాడు. సింధూజకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.


