News November 2, 2024
కోనసీమ ఎస్పీకి ఫోన్ చేసిన పవన్

రాజమండ్రి విమానాశ్రయం వద్ద ఆలమూరు మండలం మడికి చెందిన శ్రీనివాసరావు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసి, 10వ తరగతి చదువుతున్న తన కుమార్తె వెన్నెల ఆత్మహత్య చేసుకుందని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేయించాలన్నారు. చెముడులంక ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న వెన్నెల స్కూల్ యాజమాన్యం ఒత్తిడి, బెదిరింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందన్నారు. కోనసీమ ఎస్పీతో పవన్ కళ్యాణ్ ఫోన్లో మాట్లాడారు. దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు.
Similar News
News February 28, 2026
RJY కల్తీ పాలు ఘటన.. 15 మందికి చికిత్స

RJY కల్తీ పాలు ఘటనలో బాధితులైన 15 మంది ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని DMHO కే.వెంకటేశ్వర రావు శనివారం తెలిపారు. వీరిలో కిమ్స్ లో 8 మంది, రెయిన్బోలో ముగ్గురు చిన్న పిల్లలు, డెంటల్‌లో ఇద్దరు, RACC, రవి చైతన్య ఆసుపత్రుల్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారని వెల్లడించారు. సీనియర్ నెఫ్రాలజిస్ట్ పర్యవేక్షణలో వీరికి వైద్య సేవలు అందుతున్నాయని, ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందన్నారు.
News February 28, 2026
కల్తీ పాలు బాధితులకు మంత్రి నిమ్మల భరోసా

రాజమండ్రి కలెక్టరేట్‌లో శనివారం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రభుత్వం తరఫున బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రోగుల కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించి, అత్యుత్తమ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
News February 28, 2026
సబ్ రిజిస్ట్రార్ నివాసాల్లో ఏసీబీ సోదాలు

రాజమండ్రి, కడియం పరిధిలో ఏసీబీ అధికారులు శనివారం మెరుపు దాడులు చేశారు. సబ్ రిజిస్ట్రార్ లక్ష్మీ, సీనియర్ అసిస్టెంట్ కృష్ణ, సబ్ ఆర్డినేట్ వీరబాబు నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. కాకినాడ, రాజమండ్రిలోని వీరి ఇళ్లలో ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


