News May 14, 2024
కోనసీమ: ఓటు వేశాక ఫిట్స్.. చికిత్స పొందుతూ మృతి

అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం గోగన్నమఠానికి చెందిన కర్రి సత్యనారాయణ(52) ఫిట్స్‌తో మృతి చెందాడు. గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద సోమవారం ఓటు వేసిన అనంతరం ఫిట్స్‌తో స్పృహ తప్పి పడిపోయాడు. స్థానికులు వెంటనే రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని కుటుంబీకులు తెలిపారు. చేపల వేటపై ఆధారపడి జీవనం సాగించే సత్యనారాయణ మృతితో కుటుంబం పెద్దదిక్కు కోల్పోయింది.
Similar News
News December 14, 2025
రాజమండ్రి: టెట్ పరీక్షల్లో 129 మంది గైర్హాజరు

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ 2025) ఐదవ రోజు ఆదివారం ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖ అధికారి కె. వాసుదేవరావు తెలిపారు. రాజమండ్రి లూధర్ గిరిలో ఉన్న రాజీవ్ గాంధీ కళాశాలలో మొదటి షిఫ్ట్‌లో 955 మందికి 895 మంది హాజరయ్యారని, 60 మంది గైర్హాజరు అయ్యారన్నారు. మధ్యాహ్నం రెండవ షిఫ్ట్‌లో 700 మందికి 631 మంది హాజరైనట్లు, 69 మంది గైర్హాజరు అయినట్లు డీఈఓ వాసుదేవరావు తెలిపారు.
News December 14, 2025
రాజమండ్రి: రికార్డులు లేని 68 బైక్‌లు సీజ్

తూ.గో జిల్లాలో అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ నరసింహ కిషోర్ హెచ్చరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్, స్పెషల్ పార్టీ సిబ్బంది సంయుక్తంగా టీములుగా ఏర్పడి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించినట్లు తెలిపారు. దీనిలో భాగంగా 68 నంబర్, రికార్డు లేని ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు సీజ్ చేశామని తెలిపారు. 30 మంది పాత నేరస్తుల ఇళ్లను తనిఖీ చేశామన్నారు.
News December 14, 2025
ఈనెల 15న యథావిధిగా PGRS: కలెక్టర్

డిసెంబర్ 15 సోమవారం జిల్లా కలెక్టరేట్ నుంచి గ్రామ/వార్డు సచివాలయాల వరకు PGRS కార్యక్రమం యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల అర్జీలను స్వీకరించి తక్షణ పరిష్కార చర్యలు చేపడతామని తెలిపారు. అర్జీదారులు తమ వినతులను Meekosam.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని, అర్జీల స్థితి తెలుసుకోవడానికి 1100 నంబర్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.


