News March 6, 2025

కోనసీమ : కల్లు గీత కార్మికుల మద్యం షాపులకు లాటరీ

image

కలెక్టరేట్‌ గోదావరి భవనంలో అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో కల్లు గీత కార్మికుల మద్యం షాపుల ఎంపిక కోసం గురువారం ఉదయం 11 గంటలకు లాటరీ నిర్వహిస్తున్నట్లు అమలాపురం ఎక్సైజ్‌ సూపర్‌రిండెంట్‌ ఎస్‌కేడీవీప్రసాద్‌ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగియడంతో షాపుల టెండర్లను జిల్లా కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ అధ్వర్యంలో లాటరీ తీస్తామన్నారు. 13 మద్యం షాపులకు గాను 261 టెండర్లు వచ్చాయని ప్రసాద్‌ తెలిపారు.

Similar News

News February 28, 2026

కాకినాడ పేలుడు ఘటనపై PM దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటన

image

AP: కాకినాడ జిల్లాలో జరిగిన బాణసంచా పేలుడు ఘటనపై పీఎం మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదవశాత్తు జరిగిన పేలుడులో ప్రాణనష్టం సంభవించడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 21 మంది చనిపోయారు.

News February 28, 2026

ఎస్సార్ఆర్ కళాశాలలో ఘనంగా ‘సైన్స్ డే’

image

SRR ప్రభుత్వ డిగ్రీ కళాశాల జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన, పోస్టర్ మేకింగ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. వైస్ ప్రిన్సిపల్ నితిన్, రాజయ్య, లెఫ్టినెంట్ రాజు, డాక్టర్ సంగీత, విభాగాధిపతి కిరణ్మయి, మహేష్, రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.

News February 28, 2026

విశాఖ: మహిళా కార్పొరేటర్ల నిరసన.. టూర్ కావాలని డిమాండ్

image

జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో మహిళా కార్పొరేటర్లు వినూత్న డిమాండ్‌తో నిరసన తెలిపారు. కౌన్సిల్ గడువు ముగుస్తున్న తరుణంలో మేయర్ పీలా శ్రీనివాస్ ప్రతిపాదించిన స్పోర్ట్స్ మీట్‌ను వారు తిరస్కరించారు. తమను టూర్‌కు పంపాలని పట్టుబడుతూ పోడియంను చుట్టుముట్టారు. వీరి డిమాండ్‌కు బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మద్దతు పలికారు. పార్టీలకు అతీతంగా మహిళా సభ్యులంతా ఏకమై ఈ నిరసనలో పాల్గొన్నారు.