News November 23, 2025

కోనసీమ కష్టాలకు పవన్ ‘బ్రేక్’ వేస్తారా?

image

కోనసీమ కొబ్బరి రైతులు కన్నీరు పెడుతున్నారు. మలికిపురం ప్రాంతంలో ఒకవైపు తెగుళ్లు, మరోవైపు ఆక్వా సాగుతో పెరిగిన ఉప్పునీటి ప్రభావం కారణంగా పచ్చని కొబ్బరి చెట్లు నిలువునా ఎండిపోతున్నాయి. తోటలు నాశనమవుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు 26న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇక్కడ పర్యటించనున్నారు. పవన్ తమ సమస్యలు పరిష్కరిస్తారని రైతులు కొండంత ఆశలు పెట్టుకున్నారు.

Similar News

News November 23, 2025

శ్రీకాకుళం: దైవ దర్శనాలకు వెళ్తూ మృత్యుఒడిలోకి..!

image

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరు వ్యక్తులు వ్యాన్‌లో దైవ దర్శనాలకు వెళ్తూ <<18364371>>మృత్యుఒడిలోకి<<>> చేరుకున్నారు. కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. అయోధ్య, కాశీ, పూరీ వంటి క్షేత్రాలు దర్శించుకున్న అనంతరం శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో గాయపడ్డ ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు.

News November 23, 2025

వనపర్తి: లక్ష్యానికి దూరంగా పన్నుల వసూళ్లు

image

గృహ, వ్యాపార సముదాయాల నుంచి వసూలు చేసే పన్నుల విషయంలో పురపాలక శాఖ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. పట్టణంలో పలువురు పన్నులు సవరించాలని పురపాలికకు దరఖాస్తు చేసుకున్నా.. పట్టించుకోవడం లేదు. 2021 నుంచి 2026 వరకు 18,500 గృహ, వ్యాపార సముదాయాల నుంచి రూ.12.53 కోట్ల పన్నులు వసూలు చేయాల్సింది ఉండగా.. కేవలం రూ.2.60 కోట్ల పన్నులు మాత్రమే వసూలు చేశారు.

News November 23, 2025

KNR: సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్ టెక్నిషియన్‌లో ఉచిత శిక్షణ

image

క్రాష్ ప్రొఫెషనల్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సుకు నిరుద్యోగ క్రైస్తవ మైనార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టి సంక్షేమ శాఖ అధికారి తెలిపారు. సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్ టెక్నిషియన్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తుతో పాటు అభ్యర్థి ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికెట్లును DEC 10 లోపు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించాలి.