News January 11, 2026
కోనసీమ: గాలిపటం ఎగురవేస్తూ బాలుడి గల్లంతు

గాలిపటం ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ చిన్నారి గల్లంతైన ఘటన ఆదివారం పేరూరు హైస్కూల్ సమీపంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. నందుల మోక్ష (9), తన తమ్ముడు తిలక్‌తో కలిసి గాలిపటం ఎగురువేస్తూ ప్రమాదవశాత్తు మంచినీటి చెరువులో జారిపడ్డారు. తిలక్ సురక్షితంగా బయటపడగా, మోక్ష నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు చిన్నారి కోసం గాలిస్తున్నారు.
Similar News
News February 20, 2026
‘కొండా లక్ష్మణ్ బాపూజీ’ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 7, 2026 చేనేత దినోత్సవం సందర్భంగా “ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ” పేరుతో చేనేత కార్మికులకు అవార్డులు ప్రదానం చేయనుంది. అర్హత గల చేనేత, డిజైనింగ్ విభాగ కార్మికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు NLG, SRPT జిల్లాల సహాయ సంచాలకులు ద్వారక్ తెలిపారు. ఎంపికైన వారికి రూ.25 వేలు, జ్ఞాపిక అందజేయనున్నారు. 31-12-2025 నాటికి చేనేత విభాగంలో 30 ఏళ్లు అనుభవం ఉన్న వారు అర్హులు.
News February 20, 2026
NTR: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో నవంబర్ 2025లో నిర్వహించిన L.L.B. III/III 5వ & V/V 9వ, ఎం.ఈడీ కోర్సు 3వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://nagarjunauniversity.ac.in/examcell/results ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
News February 20, 2026
హన్మక్కపల్లిలో చిరుత బీభత్సం

వేములవాడ మున్సిపల్ పరిధి హన్మక్కపల్లిలో చిరుతపులి కలకలం సృష్టించింది. గురువారం అర్ధరాత్రి రైతు రోమాల భూమయ్యకు చెందిన ఆవు దూడపై చిరుత దాడి చేసి చంపేసింది. పాదముద్రలను పరిశీలించిన అటవీ శాఖ అధికారులు ఇది చిరుత పనేనని నిర్ధారించారు. అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఘటనాస్థలికి చేరుకున్న మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు బాధిత రైతును పరామర్శించారు.


