News April 8, 2024
కోనసీమ: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఇదే..

కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం, అమలాపురం పట్టణాల్లో ఈ నెల 11వ తేదీన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారని అమలాపురం ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్, పి.గన్నవరం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. సభ నిర్వహణకు ముందు ఇరుపార్టీల ముఖ్య నాయకులతో సమావేశం ఉంటుందన్నారు.
Similar News
News October 4, 2025
రాజమండ్రి : అక్టోబర్ 15 ‘NMMS’ పరీక్ష దరఖాస్తుకు తుది గడువు

డిసెంబర్ 7న జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ అప్లికేషన్‌ను ప్రభుత్వ పరీక్షల కార్యాలయ వెబ్సైట్ www.bse.ap.gov.in లో అందుబాటులో ఉంచినట్లు డీఈవో కె. వాసుదేవరావు ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 15 తుది గడువుగా పేర్కొన్నారు. పరీక్ష రుసుం చెల్లింపునకు 16వ తేదీ, సంబంధిత పత్రాలతో 18వ తేదీలోగా డీఈఓ కార్యాలయానికి సమర్పించాలన్నారు.
News October 4, 2025
బాణాసంచా గోడౌన్లను తనిఖీ చేసిన జేసీ మేఘ స్వరూప్

దీపావళి బాణాసంచా తయారీ, అమ్మకాలకు సంబంధించి కచ్చితంగా లైసెన్సులు తీసుకోవాలని జేసీ మేఘ స్వరూప్ స్పష్టం చేశారు. శుక్రవారం అధికారులతో కలిసి ఇటీవల దరఖాస్తు చేసుకున్న బాణాసంచా గోడౌన్లను ఆయన తనిఖీ చేశారు. గోదాముల వద్ద భద్రతా ప్రమాణాలను ఆయన పరిశీలించారు. భద్రత ప్రమాణాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్ మెరికమ్మ, ఇతర అధికారుల ఆయన వెంట ఉన్నారు.
News October 3, 2025
కొవ్వూరు: ‘గృహ నిర్మాణాలను వేగవంతం చేయండి’

కొవ్వూరు మండలంలో గృహ నిర్మాణాల పురోగతిపై జిల్లా గృహ నిర్మాణాధికారి బుజ్జి శుక్రవారం సమీక్షించారు. గృహ నిర్మాణ శాఖ ఆఫీస్‌లో నియోజకవర్గంలోని హౌసింగ్ అధికారులతో నిర్మాణాలను దశలవారీగా చర్చించారు. త్వరలో సీఎం రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఇళ్లను సామూహిక గృహప్రవేశాలు చేయనందున నిర్మాణ పనులు వేగ వంతం చేయాలని ఆదేశించారు. ఈఈ సీహెచ్ వేణుగోపాలస్వామి, డీఈఈ శేఖర్ బాబు, ఏఈలు పాల్గొన్నారు.