News February 22, 2025
కోనసీమ జిల్లా TODAY TOP NEWS

➤ఆలమూరు: తండ్రి చితికి తలకొరివి పెట్టిన కుమార్తె
➤ DRKM: శివరాత్రి ఏర్పాట్లు సమీక్షించిన ఎస్పీ
➤ మండపేట: జాతీయస్థాయి క్రీడలకు ముగ్గురు ఎంపిక
➤ అమలాపురంలో సెలూన్, పార్లర్లో తనిఖీలు
➤ ఉప్పలగుప్తం: సబ్ స్టేషన్ ముట్టడించిన రైతులు
➤ ముమ్మిడివరంలో అలరించిన 8 మంది కవలలు
➤ వాడపల్లిలో జబర్దస్త్ నటి సందడి
➤ అమలాపురం: కనువిందు చేసిన కవలలు
Similar News
News February 23, 2025
MNCL: ఎన్నికలకు సింగరేణి కార్మికులు దూరమేనా..?

ఈనెల 27న జరిగే పట్టభద్రుల ఎన్నికలకు సింగరేణి కార్మికులకు యాజమాన్యం ఇప్పటి వరకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రకటించకలేదు. దీంతో ఓటు హక్కు వినియోగించుకోలేమని సింగరేణి పట్టభద్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వివిధ శాఖల ఉద్యోగులకు స్పెషల్ లీవ్‌లు ఇస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. కానీ సింగరేణి కార్మికులకు స్పెషల్ లీవ్ ఆదేశాల రాలేదని పలువురు కార్మికులు Way2News దృష్టికి తీసుకువచ్చారు.
News February 23, 2025
పోక్సో, గ్రేవ్ కేసుల విచారణ పూర్తి చేయాలి: ఎస్పీ

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో ఎస్పీ డివి శ్రీనివాసరావు నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ పూర్తి పారదర్శకంగా చేయాలన్నారు. పోక్సో, గ్రేవ్ కేసులలో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తిచేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయాలని సూచించారు.
News February 23, 2025
వరంగల్: మహా శివరాత్రి.. మరో 3 రోజులే!

శివరాత్రి వేడుకలకు ఓరుగల్లు పెట్టింది పేరు. WGL నగరంలోని వేయి స్తంభాల గుడి, సిద్ధేశ్వరాలయం, మెట్టుగుట్ట సహా పలు దేవాలయాలు భక్తులతో పండుగరోజు నిండిపోతాయి. ఐనవోలు(HNK), రామప్ప(ములుగు), కాళేశ్వరాలయం(BHPL), పాలకుర్తి సోమేశ్వర(జనగామ), కురవి వీరభద్రస్వామి(MHBD) దేవాలయాలు జాగారం ఉన్న శివ భక్తులతో కిటకిటలాడతాయి. రాత్రంతా భక్తుల భజనలు, కీర్తనలతో దద్దరిల్లుతాయి. మీరు ఏ గుడికి వెళ్తున్నారో కామెంట్ చేయండి.