News March 17, 2025
కోనసీమ: టెన్త్ పరీక్షలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

నేటి నుంచి జిల్లాలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. వీటి నిర్వహణకు ముమ్మిడివరం ఎయిమ్స్ కళాశాలలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు ద్వారా పర్యవేక్షణ చేస్తున్నట్లు డీఈవో షేక్ సలీంబాషా తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఏ ఇబ్బందులు తలెత్తితే కంట్రోల్ రూం నంబర్ 9493819102కు తెలియజేయాలన్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేసి స్క్వాడ్లను నియమించామన్నారు.
Similar News
News December 24, 2025
రాహుల్ గాంధీ పార్ట్ టైమ్ పొలిటీషియన్: నితిన్ నబీన్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్ట్ టైమ్ పొలిటీషియన్ అని బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ విమర్శించారు. ఎన్నికలప్పుడు ఆయన బిహార్ వచ్చారని, ఆ తర్వాత దేశం విడిచి వెళ్లారని ఆరోపించారు. ‘దేశంలో ఉంటే ఎన్నికల కమిషన్‌ను నిందిస్తారు. సుప్రీంకోర్టును విమర్శిస్తారు. రానున్న ఎన్నికల్లో బెంగాల్, కేరళ ఓటర్లు కూడా రాహుల్‌కు శిక్ష విధిస్తారు’ అని పట్నాలో జరిగిన పార్టీ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.
News December 24, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 24, బుధవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.25 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.43 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.16 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.13 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.49 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.06 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News December 24, 2025
HYD: హద్దు మీరితే “హ్యాపీ” న్యూ ఇయర్ కాదు: సీపీ సజ్జనర్

నూతన సంవత్సరం వేడుకల పేరుతో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని HYD పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. నేటి నుంచి న్యూ ఇయర్ రోజు వరకు నగరవ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో క్రిస్మస్, న్యూ ఇయర్ బందోబస్తుపై క్షేత్రస్థాయి అధికారులతో సీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.


