News January 6, 2026
కోనసీమ: దేశ చరిత్రలోనే అతిపెద్ద బ్లోఅవుట్ ఇదే..!

ఇరుసుమండ బ్లో అవుట్ నేపథ్యంలో ప్రజలు 1995 నాటి పాసర్లపూడి ఓఎన్‌జీసీ బావి అగ్నిప్రమాద ఘటనను గుర్తు చేసుకుంటున్నారు. దేశ చరిత్రలోనే అతిపెద్ద బ్లోఅవుట్‌గా నమోదైన ఈ మంటలను ఆర్పేందుకు అమెరికా నిపుణుడు నీల్ ఆడమ్స్ బృందం రంగంలోకి దిగింది. అయితే ఓఎన్‌జీసీ అధికారులతో వ్యూహపరమైన విభేదాల వల్ల ఆయన మధ్యలోనే నిష్క్రమించారు. చివరకు 65 రోజుల తర్వాత అంతర్జాతీయ సంస్థల సాయంతో మంటలను అదుపు చేశారు.
Similar News
News February 21, 2026
రాష్ట్రంలో రేపటి నుంచి వర్షాలు!

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడనున్నట్లు HYD వాతావరణ కేంద్రం తెలిపింది. 23-24వ తేదీల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, NZB, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, WGL, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News February 21, 2026
PDPL: గ్రామీణ యువతకు ఉపాధి శిక్షణ

పెద్దపల్లి RSETI సంస్థ 2026-27 సంవత్సరానికి గ్రామీణ నిరుద్యోగ యువత కోసం పలు స్వయం ఉపాధి శిక్షణలను అందించనుంది. మగ్గం వర్క్, జ్యువెలరీ, బ్యూటీ పార్లర్, ఫోటోగ్రఫీ, సీసీ కెమెరా సర్వీసెస్, కార్ డ్రైవింగ్, ఫాస్ట్ ఫుడ్, పాపడ్-పికిల్స్ తయారీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తామని, ఆసక్తిగల వారు 9392221907ను సంప్రదించాలని డైరెక్టర్ రాకేశ్ పరిష తెలిపారు.PDPL:
News February 21, 2026
వేడెక్కిన కశ్మీర్.. ALL TIME RECORD

ఎప్పుడూ చల్లగా ఉండే కశ్మీర్ ఇవాళ వేడెక్కెంది. ఏకంగా 21 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ ప్రాంతంలో FEBలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. సాధారణం కంటే 11 డిగ్రీలు అధికంగా రికార్డయింది. అక్కడ 1940, 2016లో ఉష్ణోగ్రత 20 డిగ్రీలను తాకింది. అలాగే ఈ నెలలో మంచుతో కప్పబడే గుల్మార్గ్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత 2 డిగ్రీలు కాగా ఇవాళ 11.5 డిగ్రీలకు చేరింది. రాబోయే రోజుల్లో వేడి మరింత పెరగొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


