News March 24, 2025

కోనసీమ: నామినేటెడ్ పదవులు దక్కేది ఎవరికో?

image

మూడో విడత నామినేటెడ్ పదవుల భర్తీ జరుగుతుందన్న నేపథ్యంలో కోనసీమ జిల్లాలో ఎవరికి పదవులు దక్కేనన్న దానిపై ఊహాగానాలు సాగుతున్నాయి. కొత్తపేట నుంచి బీసీ నేత రెడ్డి సుబ్రహ్మణ్యం, రాజోలు నియోజకవర్గం నుంచి జడ్పీ మాజీ ఛైర్మన్ నామన రాంబాబు, అమలాపురం నుంచి మెట్ల రమణబాబు, ముమ్మిడివరం నుంచి గుత్తుల సాయి, పి.గన్నవరం నియోజకవర్గం నుంచి నాథ్‌బాబు, కొత్తపేట జనసేన నేత బండారు శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి.

Similar News

News November 4, 2025

అందుకే ముంబై వెళ్లి WWC ఫైనల్ చూశా: లోకేశ్

image

AP: అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చే వైసీపీ చీఫ్ <<18199297>>జగన్<<>> మమ్మల్ని వేలెత్తి చూపిస్తున్నారని మంత్రి లోకేశ్ మండిపడ్డారు. ‘తుఫాను వేళ సీఎం నుంచి పంచాయతీ ఉద్యోగి వరకు ప్రజల వద్దే ఉన్నారు. తుఫాను వచ్చినప్పుడు మేమేం చేశామో తెలిసేందుకు మీరిక్కడ లేరు. నాకు మహిళలంటే గౌరవం, అందుకే ముంబై వెళ్లి WWC ఫైనల్ చూశా. తల్లి, చెల్లిని తరిమేసిన మీకు దేశభక్తి, మహిళా శక్తి గురించి ఏం తెలుస్తుంది’ అని కౌంటర్ ఇచ్చారు.

News November 4, 2025

ప్రతి 40 రోజులకో యుద్ధ నౌక: నేవీ చీఫ్

image

ప్రతి 40 రోజులకు ఒక స్వదేశీ యుద్ధనౌక లేదా జలాంతర్గామిని ఇండియన్ నేవీలోకి చేరుస్తున్నామని చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి వెల్లడించారు. 2035 నాటికి 200కు పైగా వార్ షిప్‌లు, సబ్‌మెరైన్లు కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం 52 నౌకలు భారత షిప్‌యార్డుల్లోనే నిర్మితమవుతున్నాయని తెలిపారు. కాగా ప్రస్తుతం మన వద్ద 145 యుద్ధ నౌకలు, జలాంతర్గాములు ఉన్నాయి.

News November 4, 2025

మన్యం కేఫ్ పరిశీలించిన DRDA పీడీ

image

పార్వతీపురం ఐటీడీఏ పెట్రోల్ బంక్ ఆవరణలో DRDA ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మన్యం కేఫ్‌ను DRDA పీడీ ఎం.సుధారాణి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అమ్మకాలను పరిశీలించారు. మన్యం జిల్లా మహిళా సంఘాల సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులను ఈ కేఫ్ ద్వారా అమ్మకాలు చేపడుతున్నామని, ప్రజలు ఈ ఉత్పత్తులు కొనుగోలు చేసి సహకరించాలని కోరారు.