News March 3, 2025

కోనసీమ: నేడే కౌంటింగ్.. జిల్లాలో ఉత్కంఠ

image

ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ MLC ఎన్నికల లెక్కింపు నేడు జరగనుంది. 35 మంది అభ్యర్థులు పోటీ చేయగా 27న జరిగిన పోలింగ్‌లో 63.26% ఓటింగ్ నమోదైంది. సోమవారం ఏలూరు సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగే కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం 28 టేబుల్‌లను ఏర్పాటు చేశారు. 17 రౌండ్లలో లెక్కింపు జరగనుంది. మరి కొన్నిగంటల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ వీడనుంది.

Similar News

News December 14, 2025

మహబూబాబాద్‌: @11AM.. 1,18,708 ఓట్లు నమోదు

image

మహబూబాబాద్ జిల్లాలో రెండో విడతలోని 7 మండలాల్లో ఉదయం 11 గంటల వరకు 1,18,708 ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు. మండలాల వారీగా… బయ్యారంలో 21,210, చిన్నగూడూరులో 7,411, దంతాలపల్లిలో 17,297, గార్లలో 15,559, నరసింహులపేటలో 15,722, పెద్దవంగరలో 14,911, తొర్రూరులో 26,598 ఓట్లు నమోదయ్యాయి. జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

News December 14, 2025

ఓపెన్ పోర్స్ తగ్గడానికి ముల్తానీ మట్టితో ప్యాక్

image

మొటిమలు, పొల్యూషన్ కారణంగా చాలా మందిలో ముఖంలో ఓపెన్ పోర్స్ వస్తాయి. వీటిని తగ్గించుకునేందుకు ముల్తానీ మట్టితో ఫేస్ ప్యాక్ ఉపయోగపడుతుంది. ముల్తానీ మట్టి, పసుపు, రోజ్ వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఈ ప్యాక్‌ని రాసుకొని 15ని. తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని మసాజ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. ఈ ప్యాక్ వారానికి రెండుసార్లు వేసుకుంటే ఫలితం ఉంటుంది. శనగపిండి ప్యాక్ కూడా బాగా ఉపయోగపడుతుంది. #SkinCare

News December 14, 2025

కేఎల్ స్వామి దాస్‌కు డాక్టర్ అంబేడ్కర్ జాతీయ అవార్డు

image

గుంతకల్లుకు చెందిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కేఎల్ స్వామి దాస్ ఢిల్లీలో ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జాతీయ అవార్డు’ను అందుకున్నారు. భారతీయ దళిత సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సుమనాక్షర్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు. మాదిగలు, అణగారిన కులాల సమస్యల పరిష్కారం కోసం 30 ఏళ్లకు పైగా చేసిన నిస్వార్థ సామాజిక సేవకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించినట్లు స్వామి దాస్ పేర్కొన్నారు.