News February 26, 2025

కోనసీమ మోనాలిసా అంటూ పోస్టింగ్.. కేసు నమోదు

image

మైనర్ బాలికపై ఇంస్టాగ్రామ్‌లో పోస్టింగ్ పెట్టి ఆమెను మనస్తాపానికి గురిచేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ జ్వాలాసాగర్ బుధవారం తెలిపారు. సిహెచ్ గున్నేపల్లి సత్తెమ్మ తల్లి తీర్థంలో అమలాపురానికి చెందిన మైనర్ బాలిక పూసలు అమ్ముకుంటుందన్నారు. అమలాపురం చింతాడ గరువుకు చెందిన దేవిశ్రీప్రసాద్ వీడియోలు తీసి ఇంస్టాగ్రామ్‌లో కోనసీమ మోనాలిసా అంటూ పోస్టింగ్ చేశాడన్నారు. దీనిపై బాలిక పినతల్లి ఫిర్యాదు చేశారు.

Similar News

News February 21, 2026

రేపు దేవాదులకు సీఎం రేవంత్ రెడ్డి

image

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు, తుపాకులగూడెం సమ్మక్క- సాగర్ బ్యారేజ్‌ను ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. ప్రాజెక్టుల పురోగతి, నీటి నిల్వలు, సాగునీటి పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం పర్యటనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు భారీగా హాజరుకానున్నారు.

News February 21, 2026

తిరుపతి: ALERT.. రేపే లాస్ట్.!

image

SVU పరిధిలో (UG) డిగ్రీ మొదటి, రెండో, మూడో సంవత్సర ఇయర్ ప్యాటర్న్ పరీక్షలు ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్ల జారీ కొనసాగుతోందని పరీక్షల విభాగ నియంత్రణ అధికారి రాజమాణిక్యం పేర్కొన్నారు. 22వ తేదీ (ఆదివారం) సాయంత్రం 5 వరకు అభ్యర్థులు హాల్ టికెట్లు పొందవచ్చని ఆయన సూచించారు.

News February 21, 2026

విద్యార్థుల కోసం స్టూడెంట్ వెల్నెస్ ప్రోగాం: కలెక్టర్

image

హన్మకొండలో బాలల కోసం ప్రత్యేకంగా స్టూడెంట్ వెల్నెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు వివరించారు. శనివారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ.. స్టూడెంట్ వెల్నెస్ ద్వారా వారి మానసిక వికాస స్థాయిలను గుర్తించి, అవసరమైన వారికి ఆత్మస్థైర్యాన్ని కల్పించే వీలు కలుగుతోందన్నారు. బాలల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపడుతునట్లు చెప్పారు.