News January 31, 2025
కోనసీమ: మౌలిక సదుపాయాలకు ప్రతిపాదనలు రూపొందించాలి- కలెక్టర్

కోనసీమ జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో అన్ని మౌలిక సదుపాయాలు సక్రమంగా ఉండేలా నవీణీకరణ చేపట్టిన సర్వే ప్రతిపాదనలు కాంపోనెంట్ వారీగా విద్యార్థుల దామాషా ప్రాతిపదికన రూపొందించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులకు సూచించారు. ఆయన అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సర్వే నివేదికలలో స్పష్టత కొరబడిందన్నారు.
Similar News
News March 1, 2025
రాజీనామా తర్వాత GV రెడ్డి తొలి ట్వీట్

AP: టీడీపీకి <<15567607>>రాజీనామా తర్వాత<<>> బడ్జెట్‌ను అభినందిస్తూ జీవీ రెడ్డి చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేవలం రూ.33,000cr రెవెన్యూ లోటుతోనే రూ.3.2లక్షల కోట్ల బడ్జెట్ రూపొందించారన్నారు. ‘రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, చంద్రబాబు నాయకత్వం పట్ల ఎప్పటికీ గౌరవం ఉంటుంది. తక్కువ కాలంలోనే పార్టీలో నాకు దక్కిన గౌరవం పట్ల ఆయనకు రుణపడి ఉంటాను. 2029లోనూ మా సార్ CM కావాలి’ అని ట్వీట్ చేశారు.
News March 1, 2025
అల్లూరి జిల్లాలో నేటి నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్

కొత్త వాహన చట్టాన్ని మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చేందుకు జిల్లా అధికారులు చర్యలు చేపట్టారని కొయ్యూరు ఎస్‌ఐ పీ.కిషోర్ వర్మ తెలిపారు. ఇకపై హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రూ.1,000, డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే రూ.5వేలు, మద్యం తాగి, సెల్‌ఫోన్ పట్టుకుని వాహనం నడిపితే రూ.10వేలు, నెంబర్ ప్లేట్ సరిగ్గా లేకుంటే రూ.2వేలు జరిమానా విధించనున్నారు.వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించి, సహకరించాలని సూచించారు.
News March 1, 2025
రాజా సాబ్.. 3 గంటలు!

ప్రభాస్ లేటెస్ట్ సినిమా రాజా సాబ్ షూటింగ్ వేగంగా జరుగుతోంది. త్వరలో రెండు పాటల కోసం స్పెయిన్ వెళ్లనున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. అవి పూర్తయితే షూటింగ్ పూర్తయినట్లే. ఈ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌కు మారుతి దర్శకత్వం వహిస్తుండగా.. మాళవిక మోహనన్ హీరోయిన్. సినిమా నిడివి దాదాపు 3 గంటలు ఉంటుందని సమాచారం. ఏప్రిల్ 10న ఈ మూవీని రిలీజ్ చేస్తామని చిత్రబృందం ప్రకటించినా వాయిదా పడే అవకాశం ఉంది.