News March 23, 2025
కోనసీమ: రేపు యథావిధిగా మీకోసం వేదిక: కలెక్టర్

అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన అమలాపురం నుంచి ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News March 25, 2025
NZB: ‘మహిళా సంఘాలకు 200 పైచిలుకు కొనుగోలు కేంద్రాలు’

యాసంగి సీజన్ ధాన్యం సేకరణ ప్రక్రియలో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు విరివిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటాయించాలని నిర్ణయించినట్లు మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే పీ.సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. జిల్లాలో 670 కొనుగోలు కేంద్రాలకు గానూ మహిళా సంఘాలకు కనీసం 200పైచిలుకు కేంద్రాలను కేటాయించేలా చర్యలు తీసుకున్నామన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి మహిళా సంఘాలకు ఆయన కీలక సూచనలు చేశారు.
News March 25, 2025
వివేకా హత్య కేసులో కీలక పరిణామం

AP: వివేకా హత్య కేసుపై SCలో రాష్ట్ర ప్రభుత్వం అదనపు అఫిడవిట్ వేసింది. ‘MP అవినాశ్ చెప్పినట్లే సునీత, నర్రెడ్డిపై CBI అధికారి రాంసింగ్ కేసు నమోదు చేశారు. సునీత, నర్రెడ్డి, రాంసింగ్‌పై వివేకా PA కృష్ణారెడ్డి దాఖలు చేసిన కేసును IO రాజు విచారించలేదు. తనను అవినాశ్ బెదిరించారని రాజు అంగీకరించారు. రిటైర్డ్ ASP రాజేశ్వరరెడ్డి, ASIG రామకృష్ణారెడ్డి కేసు మొత్తాన్ని నడిపించారు’ అని పేర్కొన్నట్లు సమాచారం.
News March 25, 2025
ఆస్తి పన్ను వడ్డీ బకాయిల్లో 50 శాతం రాయితీ

AP: ఆస్తి పన్ను బకాయిదారులకు మున్సిపల్ శాఖ శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరు వరకు ప్రాపర్టీ ట్యాక్స్‌పై పెండింగ్‌లో ఉన్న వడ్డీ బకాయిల్లో 50 శాతం రాయితీ ఇస్తూ జీవో జారీ చేసింది. ప్రజల విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీనివల్ల కొన్నేళ్లుగా పేరుకుపోయిన రూ.కోట్ల బకాయిలు వసూలవుతాయని అధికారులు చెబుతున్నారు.