News June 29, 2024

కోనసీమ: లారీ ఢీకొని భర్త మృతి.. భార్యకు తీవ్ర గాయాలు

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. లారీ బైక్‌ను ఢీకొన్న ఘటనలో వానపల్లికి చెందిన శ్రీనివాస్(49) మృతి చెందగా, అతడి భార్య లక్ష్మీ నారాయణమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. విష పురుగు కరిచిందని కొత్తపేటలో చికిత్స చేయించుకొని తిరిగి బైక్‌పై వెళుతున్న దంపతులను వానపల్లిలో లారీ ఢీకొట్టింది. ద్వారపూడి నుంచి ధాన్యం లోడుతో వస్తున్న లారీ గణేష్‌నగర్ సెంటర్ వద్ద వీరిని ఢీకొట్టింది.

Similar News

News September 17, 2025

కలెక్టర్‌కు కీర్తి చేకూరికి ఉద్యమ నోటీసులిచ్చిన సచివాలయ ఉద్యోగులు

image

గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా ఐక్యవేదిక తరఫున జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరికి సచివాలయ ఉద్యోగులు 15 రోజుల ముందస్తు ఉద్యమ కార్యాచరణ నోటీసును అందజేశారు. బుధవారం కలెక్టర్ కార్యాలయలో ఐక్యవేదిక నాయకులు కలిసి ఈ వినతిని ఇచ్చారు. దడాల జగ్గారావు, కాశీ విశ్వనాథ్, రామాంజనేయులు, నాయుడు, కొల్లి రాజేష్, రామదాసు తదితరులు ఉన్నారు.

News September 17, 2025

రాజమండ్రి: పీఎం ఆవాస్ యోజన బ్రోచర్ ఆవిష్కరణ

image

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన – అర్బన్ 2.0 అంగీకార బ్రోచర్‌ను తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం రాజమండ్రిలోని కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ పథకం ద్వారా అర్హులైన పేదలకు సొంత ఇంటి కల సాకారమవుతుందని కలెక్టర్ తెలిపారు. లబ్ధిదారులు అక్టోబరు 31 లోగా తమ అంగీకారాన్ని తెలియజేయాలని ఆమె కోరారు.

News September 17, 2025

కలెక్టరేట్‌లో విశ్వకర్మ జయంతి వేడుకలు

image

విశ్వకర్మ జయంతి వేడుకలను పురస్కరించుకుని బుధవారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర పండుగగా విశ్వకర్మ జయంతి వేడుకలు జరిగాయని కలెక్టర్ తెలిపారు.