News October 28, 2025
కోనసీమ: లైసెన్స్ స్లాట్లను మార్చుకోండి..!

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈనెల 28, 29, 30, 31వ తేదీల్లో లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్స్ కోసం స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులు వచ్చే వారానికి మార్చుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు సూచించారు. ఆయన మాట్లాడుతూ.. తుఫాన్ కారణంగా వాహనదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు సిటిజెన్ లెవెల్‌లో స్లాట్స్ మార్చుకునే సదుపాయం తెచ్చామని చెప్పారు.
Similar News
News October 28, 2025
ఈ మందు ‘యమ’ డేంజర్

TG: రాష్ట్రంలో ఆత్మహత్యలకు వినియోగిస్తున్న పారాక్వాట్ గడ్డిమందును బ్యాన్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కొన్నిగంటల్లోనే గడ్డిని మాడిపోయేలా చేసే ఈ మందును రైతులు వాడతారు. అయితే ఆత్మహత్యలకూ వినియోగించడం ఆందోళన కలిగిస్తోంది. ఇది తాగిన వెంటనే కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. విరుగుడు లేకపోవడంతో 98% కేసుల్లో మరణాలు సంభవిస్తున్నాయి. మన దేశం కేరళ, ఒడిశాతో పాటు 32దేశాల్లో నిషేధం ఉంది.
News October 28, 2025
ఆలేరులో అధిక వడ్డీ, బిట్ కాయిన్ల దందా

ఆలేరులో అధిక వడ్డీ వ్యాపారం జోరుగా నడుస్తోంది. కొందరు వడ్డీ వ్యాపారులు బాధితుల నుంచి ముందుగానే తెల్ల కాగితంపై సంతకాలు చేయించుకుని ఈ దందా నడిపిస్తున్నట్లు సమాచారం. అలాగే బిట్ కాయిన్ల దందా విచ్చలవిడిగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కోదాడ నియోజకవర్గంలోనూ బినాన్స్ వ్యవహారంపై గతంలో వార్తలొచ్చాయి. అధిక డబ్బుకు ఆశపడి జీవితాలు ఆగం చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
News October 28, 2025
అనకాపల్లి: అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్న తుఫాన్

మొంథా తుఫాన్ అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తుంది. సోమవారం జిల్లాలో ఓ మోస్తారు వర్షం కురిసింది. మంగళవారం నుంచి ఈదురు గాలులు భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో రైతులు కంటిమీద కునుకు లేకుండా ఉన్నారు. ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 54,000 హెక్టార్లకు పైగా వరి పంటను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వరి పంట పొట్ట దశలో ఉంది.గాలులు వీస్తే పంట నేల మీదకు వాలిపోతుందని రైతులు తెలిపారు.


