News January 11, 2026

కోనసీమ వాసు కార్టూనిస్ట్ రాముకు అరుదైన ఘనత

image

కోనసీమ వాసికి అరుదైన ఘనత దక్కిందని ఏపీ కార్టూనిస్టుల సంఘం తెలిపింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పులికాట్ సరస్సు సమీపంలో ఫ్లేమింగో ఫెస్టివల్ శనివారం ప్రారంభమైంది. దీనిలో భాగంగా వ్యంగ్య చిత్రకళా ప్రదర్శనలో అమలాపురం రూరల్ బండారులంక గ్రామానికి చెందిన ప్రముఖ కార్టూనిస్ట్ మాడా రాము పర్యావరణ రక్షణ, వన్యప్రాణుల, వృక్ష సంపద ఆవశ్యకత అంశంపై గీసిన కార్టూన్ ప్రదర్శన‌కు ఈ అర్హత సాధించింది.

Similar News

News February 7, 2026

అనకాపల్లి: హెటెరో డ్రగ్స్‌లో ప్రమాదం.. వివరాలివే.!

image

అనకాపల్లి జిల్లా నక్కపల్లి హెటెరో డ్రగ్స్ కంపెనీ యూనిట్-3లో శుక్రవారం భవనం శ్లాబ్ కూలి ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడిన ఉద్యోగులను విశాఖ KGHకి తరలించగా చికిత్స పొందుతూ.. నర్సీపట్నం మండలం చెట్టుపల్లికి చెందిన అసిస్టెంట్ మేనేజర్ చిరంజీవి మృతి చెందాడు. అనకాపల్లికి చెందిన మరో సీనియర్ మేనేజర్ షేక్ మస్తాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

News February 7, 2026

MBNR: మున్సిపల్ పోరు.. గెలుపు ఎవరిదో..?

image

పాలమూరులో మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తింది. అభ్యర్థుల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకుల ప్రచారాలు.. జంప్ జిలానీలతో పోరు రసవత్తరంగా మారింది. ఇంకా రెండు రోజులే సమయం ఉండటంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

News February 7, 2026

డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ‘ఉపాధి హామీ’.. తగ్గిన పెట్టుబడి, పెరిగిన ఆదాయం

image

సేంద్రియ పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు APలోని అనకాపల్లి జిల్లాలో పలువురు రైతులు. ఈ పంటకు ఉపాధి హామీ పథకం కింద నిధుల సాయంతో వీరి పెట్టుబడి ఖర్చు చాలా వరకు తగ్గుతోంది. నిపుణుల సూచనతో పంట నాటి తొలి ఏడాది నుంచే రూ.లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. ఉపాధి హామీ కింద ఈ పంటకు ఎంత సాయం వస్తుంది? ఇతర కీలక సమాచారానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.