News March 5, 2025
కోనసీమ : 1000 ఓట్లు కూడా దాటని ఎమ్మెల్సీ అభ్యర్థులు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన 35 మంది అభ్యర్థులలో చాలా మందికి మూడంకెల స్కోరు కూడా దాటలేదు. మరికొందరికైతే 100 లోపు ఓట్లే పడ్డాయి. వేణుగోపాలకృష్ణకు 1017 ఓట్లు, హేమ కుమారికి 956, వానపల్లి శివ గణేష్ 772, అసన్ షరీఫ్ 759, బండారు రామ్మోహన్ 709, చిక్కాల దుర్గాప్రసాద్ 665, కాట్రు నాగబాబు 565 ఇలా చాలా మంది అభ్యర్థులు 1000 మార్క్ కూడా టచ్ చేయలేకపోయారు.
Similar News
News October 25, 2025
తుఫాన్ ఎఫెక్ట్.. స్కూళ్లకు సెలవులు

AP: మొంథా తుఫాన్ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మూడు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. కృష్ణా జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 27,28,29 తేదీల్లో హాలిడే ఇచ్చారు. తూర్పు గోదావరి, అన్నమయ్య జిల్లాల్లో 27,28న సెలవు ప్రకటించారు. విద్యార్థులు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. కాగా మరికొన్ని జిల్లాల్లోనూ హాలిడేస్ ప్రకటించే అవకాశం ఉంది.
News October 25, 2025
GWL: స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్లో పొరపాటు ఉండొద్దు

స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్లో ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వవద్దని రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2002 ఎలక్టోరల్ జాబితాలో నియోజకవర్గాల వారిగా 2025 ఎలక్టోరల్ జాబితా మ్యాపింగ్ చేసి 4 కేటగిరీలుగా విభజించడం జరిగిందన్నారు. వీసీలో కలెక్టర్ సంతోష్, ఆర్డీఓ అలివేలు, తహశీల్దార్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
News October 25, 2025
పార్వతీపురం: కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

మన్యం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 08963 796085 నంబర్‌కి ఫోన్ చేస్తే, వెంటనే సహాయక చర్యలు చేపడతామన్నారు.


