News March 4, 2025
కోనసీమ: MLCగా గెలిచిన రాజశేఖరం నేపథ్యం ఇదే..!

ఉభయగోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందిన పేరాబత్తుల రాజశేఖరం స్వగ్రామం కోనసీమ జిల్లాలోని జి.వేమవరం. తొలుత ఆయన కాంగ్రెస్ ఎంపీటీసీగా, అనంతరం టీడీపీ నుంచి ఎంపీపీ, జడ్పీటీసీగా పనిచేశారు. ఆక్వా వ్యాపారం చేసే రాజశేఖరం ప్రస్తుతం కాకినాడలో నివాసం ఉంటున్నారు. డిగ్రీ పూర్తిచేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న రాజశేఖరానికి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి వరించింది.
Similar News
News March 4, 2025
విశాఖలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఎత్తివేత: కలెక్టర్

విశాఖలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఎత్తివేసినట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ తెలిపారు.రాష్ట్రంలో వివిధ చోట్ల గ్రాడ్యుయేట్, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడటం, ఇతర ప్రక్రియలు ముగియటంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎత్తివేసినట్లు మంగళవారం సాయంత్రం తెలిపారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.
News March 4, 2025
వెయిట్ లిఫ్టింగ్ పోటీల విజేతలకు అభినందనలు

అల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ఏయూ తరఫున పాల్గొని 71 కిలోల విభాగంలో ఎస్.పల్లవికి గోల్డ్ మెడల్, 76 కిలోల విభాగంలో బి.జాన్సీ బ్రాంజ్ మెడల్ సాధించారు. అదేవిధంగా ఖేలో ఇండియా యూనివర్శిటి పోటీల్లో 71 కిలోల విభాగంలో ఎస్.పల్లవికి సిల్వర్ మెడల్, సీహెచ్ శ్రీలక్ష్మికి 87 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. వీరిని ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ అభినందించారు.
News March 4, 2025
చీపురుపల్లిలో యాక్సిడెంట్.. ఒకరి మృతి

చీపురుపల్లి మెయిన్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో గరివిడి మండలం రేగటికి చెందిన కుడుముల బంగారినాయుడు(32) మృతి చెందాడు. చీపురుపల్లి కనకమహాలక్ష్మి జాతరకు తన స్నేహితుడు శనపతి రాముతో కలిసి వచ్చాడు. జాతర నుంచి తిరగివెళ్తుండగా మెయిన్ రోడ్డులో బైక్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక కూర్చున్న బంగారినాయుడు రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.