News October 25, 2025

కోపల్లెలో విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి

image

విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి చెందిన ఘటన కాళ్ల మండలం కోపల్లెలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కె.షాలేంరాజు(15) స్నేహితులతో కలిసి బ్యానర్ కడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఫ్రేమ్ విద్యుత్ తీగలకు తగిలి మృతి చెందాడు. ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లిన తల్లిదండ్రులు కొడుకు మృతి చెందిన వార్త విని హుటాహుటిన కోపల్లె బయలుదేరి వస్తున్నట్లు సమాచారం.

Similar News

News October 25, 2025

జిల్లా అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు: కలెక్టర్

image

జిల్లా అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశామని, 24/7 అధికారులు అందుబాటులో ఉండాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. కలెక్టరేట్, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌లో రెవిన్యూ డివిజనల్ అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. తుపాన్ ప్రభావంపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు.

News October 25, 2025

‘మొంథా తుపాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలి’

image

మొంథా తుపాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో ఆమె జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రానున్న 3 రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. జిల్లాలో ఏ ఒక్క ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తీరం దాటే సమయంలో గంటకు 90-100 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు.

News October 25, 2025

రేపటి నుంచి 3 రోజులు బీచ్‌కి రావొద్దు: ఎస్సై

image

తుపాన్ హెచ్చరికల జారీ, సముద్రంలో అలల ఉద్ధృతి పెరిగిన కారణంగా ఈ నెల 26 నుంచి 28 వరకు పేరుపాలెం బీచ్‌లోకి సందర్శకులకు అనుమతి లేదని మొగల్తూరు ఎస్సై వాసు శనివారం తెలిపారు. వాతావరణంలోని మార్పుల వల్ల అలలు వేగంగా వస్తుండటంతో ప్రమాదం సంభవించే అవకాశం ఉందన్నారు. సందర్శకులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.