News March 30, 2024
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవికి లైన్ క్లియర్ .?

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవికి లైన్ క్లియర్ అయినట్లేనని పార్టీ వర్గాల్లో చర్చసాగుతోంది. ఎంపీ ఎన్నికలు పూర్తైన తర్వాత మంత్రి పదవి ఇచ్చేలా అధిష్ఠానం హామీ ఇచ్చినట్లు సమాచారం. అందుకే BNG ఎంపీగా కోమటిరెడ్డి లక్ష్మిని పోటీ చేయించాలని పార్టీ ఒత్తిడి చేసినా, అందుకు అంగీకరించలేదని తెలిసింది. దీంతో ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా చామల పేరును అధిష్ఠానం ప్రకటించింది.
Similar News
News September 9, 2025
NLG: ఓపెన్ టెన్త్, ఇంటర్‌కు గడువు పెంపు

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి ఓపెన్ టెన్త్, ఇంటర్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 12 వరకు పొడిగించినట్లు చిట్యాల ఎంఈవో సైదా నాయక్ తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. ఆలస్య రుసుముతో ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు.
News September 9, 2025
జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

జిల్లాలో టైఫాయిడ్ కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టి పెట్టేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా పాఠశాలలను సందర్శించాలని ఆదేశించారు. రక్షిత మంచినీరు సరఫరాపై ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ, పరిశుభ్రతపై పంచాయతీరాజ్ శాఖలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు.
News September 8, 2025
మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షకు దరఖాస్తు చేసుకోండి: DEO బిక్షపతి

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో భిక్షపతి తెలిపారు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, ఏడో తరగతిలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని చెప్పారు. దరఖాస్తులను http://bsc.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫీజు చెల్లించి సమర్పించాలని కోరారు.