News December 31, 2025

కోమాలోకి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్టిన్

image

AUS మాజీ క్రికెటర్ డామీన్ మార్టిన్ (54) కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు ప్రకటించారు. DEC 26న అనారోగ్యంతో బ్రిస్బేన్‌లోని ఆస్పత్రిలో చేరగా.. ప్రస్తుతం ఆరోగ్యం విషమంగా ఉందని తెలిపారు. మార్టిన్ Meningitis అనే వ్యాధితో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఇది మెదడువాపుకు కారణం అవుతుందన్నారు. మార్టిన్ 208 వన్డేల్లో 5,346, 67 టెస్టుల్లో 4,406 రన్స్ చేశారు. 2003 WC ఫైనల్లో వేలు విరిగినా INDపై 88 పరుగులు చేశారు.

Similar News

News February 14, 2026

NPCILలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCIL)30 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది అర్హత గలవారు మార్చి 4 వరకు అప్లై చేసుకోవచ్చు. GATE-2024, 2025, 2026 స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 26ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు జీతం రూ.74,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://npcilcareers.co.in

News February 14, 2026

కవలలకు పేర్లు.. రామ్ చరణ్ దంపతులకు చిరు ప్రశంసలు

image

కవలలకు అన్వీరా దేవి, శివరామ్ అనే పేర్లు పెట్టడంపై రామ్ చరణ్-ఉపాసనను చిరంజీవి అభినందించారు. ఈ పేర్లు ఎంతో బాగున్నాయంటూ బంధువులు, స్నేహితులు, అభిమానుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపారు. ‘‘సంస్కృతి, ఆధ్యాత్మికతను మేళవించేలా పేర్లు ఉన్నాయి. చరణ్ తన నానమ్మ అంజనా దేవి పేరు నుంచి ‘దేవి’ని అన్వీరాలో జత చేయడం నా హృదయాన్ని తాకింది. దేవుడి ఆశీర్వాదాలు మీపై ఎప్పటికీ ఉంటాయి’’ అని SMలో పోస్టు చేశారు.

News February 14, 2026

T20WC: ఒమన్ ఘోర ఓటమి

image

కొలంబో వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒమన్ ఘోర ఓటమి చవిచూసింది. 236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు 18 ఓవర్లలో 139 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ కలీమ్(50), మిర్జా(46) రాణించినప్పటికీ మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఐర్లాండ్ బౌలర్లలో లిటిల్ 3 వికెట్లు తీశారు. 51 బంతుల్లోనే 10 ఫోర్లు 4 సిక్సులతో 94 పరుగులు చేసిన ఐర్లాండ్ కెప్టెన్ టక్కర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.